
అంజన్న సన్నిధిలో జడ్జీల పూజలు
మల్యాల: కొండగట్టు శ్రీఆంజనేయస్వామి ఆలయంలో హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు న్యాయమూర్తి కుశ, జగిత్యాల జిల్లా రెండో అదనపు న్యాయమూర్తి నిక్షయ ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అర్చకులు వారికి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందించి ఆశీర్వచనాలు ఇచ్చారు. ఆలయ పర్యవేక్షకులు అశోక్‌కుమార్, ఏఎస్సై శ్రీనివాస్ పాల్గొన్నారు.
జగిత్యాల: జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌కుమార్ బుధవారం ప్రమాదశాత్తు కింద పడిపోగా.. ఎడమకాలుకు గాయమైంది. ఐఎంఏ హాల్‌లో వినాయక పూజకు హాజరై వస్తున్న క్రమంలో మెట్లపై నుంచి జారి కిందపడ్డారు. డాక్టర్లు వెంటనే పరిశీలించి స్కాన్ తీయగా.. కాలుకు ఫ్యాక్చర్ అయినట్లు గుర్తించారు. 40రోజుల పాటు విశ్రాంతి తీసుకోవాలని డాక్టర్లు సూచించినట్లు తెలిసింది. సంజయ్‌ని కలెక్టర్ సత్యప్రసాద్, అదనపు కలెక్టర్ లత, కోరుట్ల ఎమ్మెల్యే సంజయ్, కాంగ్రెస్ కోరుట్ల నియోజకవర్గ ఇన్‌చార్జి జువ్వాడి నర్సింగరావు పరామర్శించారు.
మెట్‌పల్లి: వర్షాల నేపథ్యంలో విద్యుత్ సిబ్బంది నిరంతరం అప్రమత్తంగా ఉండాలని ఎన్పీడీసీఎల్ సీఎండీ వరుణ్‌రెడ్డి సూచించారు. పట్టణంలోని డివిజన్ కార్యాలయంలో సిబ్బందితో సమావేశమయ్యారు. వారికి పలు సూచనలు చేశారు. వరదలతో విద్యుత్ లైన్లు దెబ్బతి నే అవకాశముంటుందని, వెంటనే సరి చేయాలన్నారు. అవసరమైన సామగ్రి, యంత్రాలు, కార్మికులను అందుబాటులో ఉంచుకోవాలన్నా రు. పనిచేసే సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. అనంతరం రాయికల్ మండలంలోనూ పర్యటించారు. ఆయన వెంట డీఈ మధుసూదన్, ఏడీఈ మనోహార్, ఏఈలు అమరేందర్, రవి, ప్రదీప్, శివకుమార్, శ్రీనివాస్ తదితరులున్నారు.
జగిత్యాలఅగ్రికల్చర్: సారంగాపూర్ మండలంలో గురువారం అత్యధికంగా 165 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. జిల్లాలో సగటున 60.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇబ్రహీంపట్నంలో 62.5 మి.మీ, మల్లాపూర్‌లో 70.7, బీర్‌పూర్‌లో 33.5, రాయికల్‌లో 128.5, ధర్మపురిలో 78.3, బుగ్గారంలో 112.2, జగిత్యాల రూరల్‌లో 72.8, జగిత్యాలలో 62.2, మేడిపల్లిలో 14.2, కోరుట్లలో 37, మెట్‌పల్లిలో 52.7, కథలాపూర్‌లో 27.4, కొడిమ్యాలలో 33.2, మల్యాలలో 36.6, పెగడపల్లిలో 61.4, గొల్లపల్లిలో 57.1, వెల్గటూర్‌లో 68.2, ఎండపల్లిలో 31.3, భీమారంలో 12.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.
ధర్మపురి: జిల్లా కేంద్రంలో ఇటీవల నిర్వహించిన అథ్లెటిక్స్ పోటీల్లో మగ్గిడి సోషల్ వెల్ఫేర్‌కు చెందిన విద్యార్థులు రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. హర్షవర్దన్ షార్ట్‌ఫుట్‌లో గోల్డ్ మెడల్, 60 మీటర్ల పరుగు పందెంలో రిషి గోల్డ్ మెడల్ సాధించి.. మహబూబ్‌నగర్ జిల్లాలో ఈనెల 30, 31 తేదీల్లో నిర్వహించే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారు. విద్యార్థులను ప్రిన్సిపాల్ రమేశ్, పీఈటీ కల్పన, పీడీ సంతోష్ అభినందించారు.

అంజన్న సన్నిధిలో జడ్జీల పూజలు

అంజన్న సన్నిధిలో జడ్జీల పూజలు

అంజన్న సన్నిధిలో జడ్జీల పూజలు