సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం ఎప్పుడో..?
రాయికల్: జిల్లాలోనే అతిపెద్ద మండలమైన రాయికల్‌లో వ్యవసాయేతర రిజిస్ట్రేషన్లకు ఎదురుచూపులు తప్పడం లేదు. ఇందుకు సుమారు 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న జిల్లా కేంద్రంలోని రిజిస్ట్రేషన్ కార్యాలయానికి వెళ్లాల్సి వస్తోంది. వ్యవసాయ, వ్యవసాయేతర రిజిస్ట్రేషన్ల కోసం 2018 మే 19న రాయికల్‌లో పైలెట్ ప్రాజెక్ట్‌గా రాయికల్‌లో అప్పటి కలెక్టర్ శరత్ సేవలను ప్రారంభించారు. రెండేళ్ల పాటు వ్యవసాయ, వ్యవసాయేతర రిజిస్ట్రేషన్ సేవలు పట్టణ, మండల ప్రజలకు అందాయి. ఈ సేవల ద్వారా కేవలం రెండేళ్లలో ప్రభుత్వ ఖజానాకు రూ.4 కోట్ల ఆదాయం వచ్చింది.
వ్యవసాయేతర సేవలకు ఇబ్బందులు
రిజిస్ట్రేషన్ల కోసం జగిత్యాలకు వెళ్లాల్సిందే
నాడు పైలెట్ ప్రాజెక్ట్‌గా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం
జగిత్యాలకు వెళ్తున్నాం
రాయికల్ తహసీల్ కార్యాలయంలో వ్యవసాయేతర రిజిస్ట్రేషన్ సేవలు లేకపోవడంతో 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న జగిత్యాలకు వెళ్లి సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్లు చేయించుకోవాల్సిన దుస్థితి నెలకొంది. దూరభారంతోపాటు సమయం కూడా వృథా అవుతోంది. రాయికల్‌లోనే ఏర్పాటు చేస్తే మేలు. – ఎలిగేటి రామకృష్ణ రాయికల్
వ్యవసాయేతర రిజిస్ట్రేషన్లకు జగిత్యాలకు వెళ్లాల్సిందే..
రాయికల్ మున్సిపాలిటీతోపాటు, మండలంలోని 32 గ్రామాలకు చెందిన ప్రజలు వ్యవసాయేతర రిజిస్ట్రేషన్ల కోసం 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న జిల్లా కేంద్రానికి వెళ్లి రిజిస్ట్రేషన్ చేయించుకుంటున్నారు. దూరభారంతోపాటు, సమయం కూడా వృథా అవుతోంది. పైలెట్ ప్రాజెక్ట్ కింద రాయికల్‌ను ఎంపిక చేయగా వ్యవసాయ, వ్యవసాయేతర రిజిస్ట్రేషన్ సేవలతో రూ.4 కోట్ల ఆదాయం వచ్చినా జగిత్యాలకు తరలించడంతో పట్టణ, మండల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. జిల్లాలో రాయికల్‌తోపాటు ధర్మపురిలో సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయాల ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపించారు. ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ ధర్మపురిలో మంజూరు కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. వాస్తవానికి ధర్మపురితో పోల్చితే రాయికల్‌లోనే రిజిస్ట్రేషన్లు ఎక్కువగా జరుగుతాయి. ఈ క్రమంలో రాయికల్‌లో రిజిస్ట్రేషన్ లేదా తహసీల్ కార్యాలయంలో వ్యవసాయేతర రిజిస్ట్రేషన్ సేవలను అందుబాటులోకి తేవాలని ప్రజలు కోరుతున్నారు.
సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం ఎప్పుడో..?


