పెళ్లికి ముందురోజు పరీక్షకు హాజరు | - | Sakshi
Sakshi News home page

పెళ్లికి ముందురోజు పరీక్షకు హాజరు

May 12 2023 1:20 AM | Updated on May 12 2023 1:49 PM

- - Sakshi

పెద్దపల్లి: పెళ్లికి ఒక్క రోజు ముందు బయటకు వెళ్లడం కష్టమైనప్పటికీ చదువుకోవాలన్న పట్టుదల ఆ అమ్మాయిని పరీక్ష హాల్‌కు నడిపించింది. పెళ్లి కొడుకు సహకారం అందించాడు. పట్టణంలోని అల్లమయ్యగుట్ట చింతవాడకు చెందిన ఈర్నాల పద్మావతి కోరుట్లలో బీఎస్పీ (బీజడ్‌సీ) సెకండియర్‌ చదువుతోంది. హైదరాబాద్‌కు చెందిన వ్యక్తితో శుక్రవారం మధ్యాహ్నం వివాహం జరగనుంది.

మూడు రోజుల ముందుగానే పెళ్లి కూతుర్ని చేయడం వంటి కా ర్యక్రమాలు నిర్వహించారు. గురువారం పరీ క్షకు హాజరైంది. శుక్రవారం కూడా మరో పరీక్ష ఉందని, పెళ్లి కార్యక్రమం ముగియగానే భర్తతో వెళ్లి పరీక్ష రాస్తానని పద్మావతి తెలిపింది.

Advertisement
 
Advertisement
Advertisement