తెల్లారితే పెళ్లి.. ఇంటికి వచ్చిన అక్క భర్తతో వెళ్లిపోయిన నవ వధువు | - | Sakshi
Sakshi News home page

తెల్లారితే వివాహం.. ఇంటికి వచ్చిన అక్క భర్తతో వెళ్లిపోయిన పెళ్లికూతురు

May 8 2023 11:31 AM | Updated on May 8 2023 11:31 AM

- - Sakshi

చెల్లె వివాహానికి వస్తే తన భర్తే ప్రేమ పేరుతో ఆమెను తీసుకెళ్లడంతో యువతి అక్క ఆందోళన

జగిత్యాల క్రైం : తెల్లారేసరికి పెళ్లి.. రెండు కుటుంబాల్లో అన్ని ఏర్పాట్లు చేశారు. అంతలోనే యువతి కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. చివరికి అక్క భర్తతోనే వెళ్లిపోయినట్లు తెలియడంతో వారంతా ఖంగుతిన్నారు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. జిల్లాలోని ఓ గ్రామానికి చెందిన ఓ యువతి (20)కి మరో గ్రామానికి చెందిన యువకుడితో పెళ్లి జరిపేందుకు నిశ్చయించారు.

ఆదివారం ఉదయం వధువు ఇంటివద్ద వివాహం జరగాల్సి ఉండగా అంతా సిద్ధంచేశారు. వేకువజామున వెళ్లి చూసేసరికి వధువు కనిపించలేదు. చివరికి పొరుగు జిల్లాలోని ఓ గ్రామానికి చెందిన అక్క భర్తనే వివాహానికి వచ్చి, వధువును తీసుకెళ్లినట్లు కుటుంబ సభ్యులు నిర్ధారించారు. దీంతో వివాహం నిలిచిపోవడంతో రెండు కుటుంబాల్లో ఆందోళన నెలకొంది. చెల్లె వివాహానికి వస్తే తన భర్తే ప్రేమ పేరుతో ఆమెను తీసుకెళ్లడంతో యువతి అక్క ఆందోళనకు గురైంది.

Advertisement
 
Advertisement
Advertisement