రామాయణాన్ని అర్థం చేసుకోవాలి | - | Sakshi
Sakshi News home page

రామాయణాన్ని అర్థం చేసుకోవాలి

Oct 27 2026 12:26 AM | Updated on Oct 27 2026 12:26 AM

జగిత్యాలటౌన్‌: ధర్మం, న్యాయం సత్యం, సేవామార్గాలను చూపిన వాల్మీకి మహానీయుడని అదనపు కలెక్టర్‌ ప్రసూనాంబ కొనియాడారు. ఆదికవి వాల్మీకి జయంతి సందర్భంగా కలెక్టరేట్‌లో సోమవారం ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. రామాయణాన్ని కావ్యరూపంలో అందించిన మహానీయుడు వాల్మీకి అన్నారు. ఆర్డీవో మధుసూదన్‌గౌడ్‌, బీసీ సంక్షేమ అధికారి జయరాజ్‌, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

మార్గదర్శి వాల్మీకి

జగిత్యాలక్రైం: సాహిత్యానికి ఆదికవిగా.. మానవతా విలువలకు ప్రతీకగా నిలిచిన మహర్షి వాల్మీకి అని ఎస్పీ అశోక్‌కుమార్‌ అన్నారు. ఎస్పీ కార్యాలయంలో సోమవారం వాల్మీకి జయంతిని నిర్వహించారు. వాల్మీకి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో డీసీఆర్బీ డీఎస్పీ రవికుమార్‌, ఆర్‌ఐ సైదులు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

పోలీస్‌ గ్రీవెన్స్‌కు 15 దరఖాస్తులు

ఎస్పీ కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్‌లో 15మంది నుంచి దరఖాస్తులను ఎస్పీ స్వీకరించారు. తక్షణమే చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులను ఆదేశించారు.

రాష్ట్రస్థాయి పోటీలకు వెంకటాపూర్‌ విద్యార్థులు

కోరుట్లరూరల్‌: మండలంలోని వెంకటాపూర్‌ ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులు ఎస్‌జీ ఎఫ్‌ రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. తోట చరణ్‌ తేజ, బర్కం విహంత్‌ కరీంనగర్‌ జోనల్‌ స్థాయి జూనియర్‌ వాలీబాల్‌ పోటీల్లో జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహించి.. సంగారెడ్డిలో జరిగే రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారని హెచ్‌ఎం గోపి కృష్ణారావు తెలిపారు. విద్యార్థులను సర్పంచ్‌ ద్యాగ గంగాధర్‌, ఉపాధ్యాయులు అభినందించారు.

మహిళలు స్వయం ఉపాధి సాధించాలి

మెట్‌పల్లిరూరల్‌: మహిళలు ఆర్థికంగా ఎదగా లని సెర్ప్‌ అడిషనల్‌ డీఆర్‌డీవో సునీత అన్నా రు. పట్టణంలో యూనియన్‌ బ్యాంక్‌ ఆధ్వర్యంలో మహిళలకు పుట్టగొడుగుల పెంపకంపై అవగాహన కల్పించారు. పుట్టగొడుగుల పెంపకం తక్కువ పెట్టుబడితో కూడుకుందన్నారు. శిక్షణలో ముడి సరుకుల ఎంపిక, గదులు సిద్ధం,ప్యాకింగ్‌, మార్కెటింగ్‌ నేర్పిస్తారని తెలిపారు. యూబీఐ ఆర్‌ఎస్‌ఈటీఐ డైరెక్టర్‌ బాబు, డీపీఎం రమేశ్‌, యూబీఐ చీఫ్‌ మేనేజర్‌ మహంతి, ఏపీఎం అశోక్‌ పాల్గొన్నారు.

ఓటు బచావో విజయవంతం చేయాలి

జగిత్యాల: ఢిల్లీలో నవంబర్‌ ఒకటిన జరగబోయే ఓటు బచావో.. దేశ్‌ బచావో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఏఐసీసీ ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా ఇన్‌చార్జి శరత్‌ అన్నారు. సోమవారం జగిత్యాలకు వచ్చిన ఆయన డీసీసీ అధ్యక్షుడు నందయ్య, మాజీ ఎమ్మెల్యే శ్రీశైలంగౌడ్‌ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఢిల్లీలో రాంలీల మైదానంలో కార్యక్రమం ఉటుందని, జగిత్యాల నుంచి పెద్ద ఎత్తున కార్యకర్తలు రావాలని అన్నారు. ఎమ్మెల్యే సంజయ్‌కుమార్‌, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ సమిండ్ల వాణి, ఏఎంసీ చైర్మన్‌ నారాయణరెడ్డి, ప్రధాన కార్యదర్శి కూసరి అనిల్‌, గట్టు సతీశ్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement