పోక్సో చట్టంపై అవగాహన అవసరం | - | Sakshi
Sakshi News home page

పోక్సో చట్టంపై అవగాహన అవసరం

Oct 27 2026 12:26 AM | Updated on Oct 27 2026 12:26 AM

● మెట్‌పల్లి సీనియర్‌ సివిల్‌ జడ్జి అజయ్‌కుమార్‌

● మెట్‌పల్లి సీనియర్‌ సివిల్‌ జడ్జి అజయ్‌కుమార్‌

మెట్‌పల్లి: పోక్సో చట్టంపై విద్యార్థులకు అవగాహన కల్పించాలని మెట్‌పల్లి కోర్టు సీనియర్‌ సివిల్‌ జడ్జి అజయ్‌కుమార్‌ అన్నారు. పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో సురక్షిత బచ్‌పన్‌ అభయాన్‌ స్కీం కింద సోమవారం న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. విద్యార్థి దశలోనే పోక్సో చట్టంపై అవగాహన కల్పిస్తే అనర్థాలను నివారించవచ్చన్నారు. అమ్మాయిలైనా.. అబ్బాయిలైనా లైంగిక వేధింపులు ఎదురైతే భయపడొద్దని, 1098కు కాల్‌ చేసి ఫిర్యాదు చేయాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో జూనియర్‌ సివిల్‌ జడ్జి వినుకొండ మాధవి, బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు రాంరెడ్డి, న్యాయవాదులు ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement