ఆక్రమణలపై విచారణ | - | Sakshi
Sakshi News home page

ఆక్రమణలపై విచారణ

Oct 27 2026 12:26 AM | Updated on Oct 27 2026 12:26 AM

ఏడేళ్లుగా ఏమవుతోందనే అంశంపై ఆరా అప్పటినుంచి పనిచేసిన అధికారుల విచారణ మెట్‌పల్లి రేంజ్‌లో కలకలం

అటవీ భూముల

కోరుట్ల/మెట్‌పల్లి రూరల్‌: ఒకటి కాదు.. రెండుకా దు.. ఏడేళ్లుగా మెట్‌పల్లి అటవీ రేంజ్‌ పరిధిలో అట వీ భూముల అమ్మకాల దందా కొనసాగుతున్నట్లు అనుమానిస్తున్న ఉన్నతాధికారులు లోతుగా విచారణ చేపట్టారు. మెట్‌పల్లి మండలం రంగారాపేట, ఏఎస్‌ఆర్‌తండా, కథలాపూర్‌ మండలం ఇప్పపల్లి గ్రామాల పరిధిలో ఉన్న అటవీ భూములు సుమా రు 150 నుంచి 200 ఎకరాల మేర అన్యాక్రాంతమైందని, ఈ వ్యవహారంలో ఫారెస్టు అధికారుల పాత్ర ఉందని ఆరోపణలు వచ్చాయి. ఈ క్రమంలో ‘అటవీ భూములు అన్యాక్రాంతం’ శీర్షికన ఈనెల 16న ‘సాక్షి’ కథనం ప్రచురించింది. వెంటనే ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు. ప్రస్తుతం అటవీ శాఖ విజిలెన్స్‌ విచారణ సాగుతోంది.

ఏడేళ్లుగా ఏం చేశారు..?

అటవీ భూముల అమ్మకాలు, ఆక్రమణ దందా ఏడేళ్లుగా సాగుతున్నట్లు ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఆ సమయంలో ఎవరెవరు ఎంతకాలం మెట్‌పల్లి రేంజ్‌లో పనిచేశారు..? వారి హయాంలో ఏం జరిగిందనే అంశంపై ఉన్నతాధికారులు దృష్టి సారించారు. 2019 నుంచి 2026 వరకు రంగారావుపేట, ఏఎస్‌ఆర్‌తండా పరిధిలో ఎంత అటవీ భూమి ఉండేది..? ఆక్రమణలు ఏ సమయంలో జరిగాయన్న కోణంలో ఆరా తీస్తున్నారు. ఏడేళ్లపాటు పనిచేసిన రేంజ్‌, బీట్‌ అధికారులను హైదరాబాద్‌లోని చీఫ్‌ కన్జర్వేటర్‌ కార్యాలయంలో విచారించినట్లు సమాచారం. అటవీ భూములు ఎప్పుడు ఆక్రమణకు గురయ్యాయి..? ఆ సమయంలో అధికారులు ఏమైనా చర్యలు తీసుకున్నారా..? కేసులు నమోదు చేశారా..? భూమి చదును చేసిన వాహనాలను సీజ్‌ చేశారా..? ఎన్ని కేసులు నమోదయ్యాయి..? అని లోతుగా విచారణ చేసినట్లు తెలిసింది.

మరోసారి అధికారుల సందర్శన

అటవీ భూముల అన్యాక్రాంతం ఆరోపణలపై విచారణ కోసం సోమవారం మరోసారి అటవీ ఉన్నతాధికారులు క్షేత్రస్థాయిలో విచారణ చేశారు. మెట్‌పల్లి రేంజ్‌ పరిధిలోని రంగారాపేట, ఏఎస్‌ఆర్‌తండా బీట్‌ ఫారెస్టు అటవీ భూముల సమీపంలో శాటిలైట్‌ సర్వే నిర్వహించారు. అనంతరం అటవీ భూములకు హద్దులు ఏర్పాటు చేయడానికి అవసరమైన చర్యలకు నిర్మల్‌ సర్కిల్‌ చీఫ్‌ కన్జర్వేటర్‌ అపర్ణ ఆదేశాలు ఇచ్చారు. అటవీ భూముల ఆక్రమణ.. అమ్మకాల దందాలో అవినీతి ఆరోపణలు వచ్చిన మెట్‌పల్లి రేంజ్‌ కీలక అధికారి తన సెలవును పొడిగించుకున్నట్లు సమాచారం. త్వరలో ఉద్యోగ విరమణ చేయనున్న అధికారి సెలవును ఎందుకు పొడిగించుకున్నారన్న అంశం చర్చనీయాంశంగా మారింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement