తాలిబన్‌ రూల్‌: జిమ్‌లు, పార్కుల్లో మహిళలకు ఇక నో ఎంట్రీ 

Women banned from Afghanistan gyms Ruled Taliban Govt - Sakshi

కాబూల్‌: మహిళా హక్కులను, స్వేచ్ఛను హరిస్తూ అఫ్గానిస్తాన్‌లోని తాలిబన్‌ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలోని జిమ్‌లు, పార్కుల్లోకి మహిళల ప్రవేశాన్ని నిషేధించింది. ఈ వారం నుంచే ఈ ఆదేశాలు అమల్లోకి వచ్చాయని స్పష్టం చేసింది.

బహిరంగ ప్రదేశాల్లో మహిళలు హిజాబ్‌ ధరించకపోవడం, పార్కులు, జిమ్‌లలో మహిళలు, పురుషులు విభజనను పాటించకపోవడం వల్లే తాజాగా ఈ ఆంక్షలను తీసుకువచ్చినట్లు ప్రభుత్వ ప్రతినిధి గురువారం చెప్పారు. 2021 ఆగస్ట్‌లో అధికారం చేజిక్కించుకున్న తాలిబన్లు.. మాధ్యమిక, ఉన్నత విద్యా పాఠశాలల్లో బాలికల ప్రవేశాన్ని నిషేధించారు. అనేక రంగాల్లో మహిళా ఉద్యోగులను తొలగించారు. బహిరంగ ప్రదేశాల్లో బుర్ఖా ధారణ తప్పనిసరి చేశారు.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top