బిడ్డకు జన్మనివ్వడంతోనే..వికలాంగురాలిగా మారిన ఓ తల్లి..

Woman Hands And Feet Amputated Into Septic Shock After Giving Birth - Sakshi

ఏ తల్లికి అయినా మాతృత్వం అనేది చాలా గొప్ప అనుభూతి. ఆ మధుర క్షణాలు ప్రతి తల్లికి గొప్ప జ్ఞాపకంలాంటివి. అలాంటి మాతృత్వమే ఆమెకు శాపంగా మారింది. డెలివరీ అయ్యి ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్‌ అయ్యి ఇంటికి వచ్చింది. హాయిగా తన బిడ్డతో గడపాలనుకునేలోపే మళ్లీ ఆ‍స్పత్రి పాలై వికలాంగురాలిగా మారిపోయింది. ఈ ఘటన యూఎస్‌లో చోటు చేసుకుంది.

అసలేం జరిగిందంటే.. అమెరికాలోని క్రిస్టినా పచెకో అనే మహిళ రెండో బిడ్డకు జన్మినిచ్చింది. ఆమెకు సీజెరియన్‌ చేసి బిడ్డను తీశారు. ఆమె ఆపరేషన్‌ చేయించుకుని.. రెండు రోజుల అనంతరమే ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్‌ అయ్యింది. ఐతే ఇంటికి వచ్చిన తర్వాత నుంచే నలతగా ఉండటం ప్రారంభించింది. ఆపరేషన్‌ వల్లే అలా అనిపిస్తుందంటూ నర్సు ఒక ఇంజక్షన్‌ని కూడా ఇచ్చింది.

అయినా క్రిస్టినా ఇంకా అలా డల్‌గానే ఉంది. విపరీతమైన జ్వరంతో చాలా నీరసించిపోయింది. దీంతో ఆమెను హుటాహుటినా.. ఆస్పత్రికి తరలించారు. ఐతే అక్కడ ఆమె శరీరం సెప్టిక్‌కి గురయ్యిందని తేలింది. ఆ ఇన్‌ఫెక్షన్‌ అంతా కాళ్లు, చేతులకు వ్యాపించినట్లు వెల్లడించారు వైద్యులు. దీంతో ఆమె రెండు చేతులు, పాదాలను తొలగించాల్సి వచ్చింది. ఇలా మొత్తం ఆమె ఆస్పత్రిలోనే సుమారు నాలుగుల నెలల వరకు ఉండాల్సి వచ్చింది.

ఈ మేరకు క్రిస్టినా మాట్లాడుతూ.. ఆరోజు ఇప్పటికి మర్చిపోలేనంటూ నాటి సంఘటనను గుర్తు తెచ్చుకుంది. శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడుతుండగానే..అలా కళ్లు మూతబడిపోయాయని చెబుతుంది. తన భర్త ప్లీజ్‌ కళ్లు తెరు మన పిల్లలు అంటూ ఏడుస్తున్న మాటలు వినిపిస్తున్నా.. తాను లేవలేకపోతున్నట్లు అనిపించిందని, ఆ తర్వాత ఏం జరిగిందో కూడా తనకు తెలియదంటూ.. చెప్పకొచ్చింది. ఏది ఏమైతే తాను ఆ భయానక పరిస్థితి నుంచి ప్రాణాలతో బయటపడిగలిగానూ అదే చాలు, ఇప్పుడూ నా ఇద్దరూ పిల్లలను బాగా చూసుకోవాలి అని ఆనందంగా చెబుతోంది. 

(చదవండి: ముఖంపై నీళ్లు పోసినందుకు ఏకంగా 30 ఏళ్లు జైలు శిక్ష!)

మరిన్ని వార్తలు :

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top