భారత్‌లో బయటపడిన కోవిడ్‌ వేరియంట్లు.. కప్పా, డెల్టా

WHO Names COVID-19 Variants Found in India As Kappa And Delta - Sakshi

పేర్లు పెట్టిన ప్రపంచ ఆరోగ్య సంస్థ 

జెనీవా: భారత్‌లో తొలుత వెలుగుచూసిన కోవిడ్‌ వేరియంట్లు బి.1.617.1, బి.1.617.2లకు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) కప్పా, డెల్టా అనే పేర్లు పెట్టింది. గ్రీస్‌ అక్షరమాల ప్రకారం కరోనా వైరస్‌ వేరియంట్లకు డబ్ల్యూహెచ్‌వో పేరు పెడుతోంది. సార్స్‌కోవ్‌2 వేరియంట్లను గురించి ప్రజలు సులభంగా చర్చించుకునేందుకు ఇవి ఉపయోగపడతాయని డబ్ల్యూహెచ్‌వో కోవిడ్‌ విభాగానికి చెందిన మరియా వాన్‌ కెర్ఖోవ్‌ ట్విట్టర్‌లో పేర్కొన్నారు.

ప్రమాదకరమైన ఈ వేరియెంట్లను ‘ఇండియన్‌ వేరియెంట్లు’గా పేర్కొనడాన్ని భారత ప్రభుత్వం గట్టిగా ఆక్షేపించిన విషయం తెలిసిందే. ఇండియన్‌ వేరియంట్‌ అని పేర్కొనవద్దని, రాయవద్దని మీడియా సంస్థలతో సహా అందరికీ సూచించింది. అనంతరం డబ్ల్యూహెచ్‌వో స్పందిస్తూ... తాము దేశాల పేర్లను కరోనా వేరియెంట్లకు పెట్టబోమని తెలిపింది. ఇన్నాళ్లూ సాంకేతిక నామంతోనే పిలుస్తున్న బి.1.617.1, బి.1.617.2లకు ఇప్పుడు కస్పా, డెల్టాలుగా పేర్లు పెట్టింది.   

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top