లింగ సమానత్వం.. 146 దేశాల సూచికలో భారత్‌ ర్యాంక్‌ 135!

WEF Report: Despite Improvement India Slips To 135th Rank in Gender Equality - Sakshi

న్యూఢిల్లీ:  లింగ సమానత్వం విషయంలో ఐస్‌లాండ్‌ ప్రపంచంలో తొలి స్థానంలో నిలిచింది. తర్వాతి స్థానాల్లో ఫిన్‌లాండ్, నార్వే, న్యూజిలాండ్, స్వీడన్‌ నిలిచాయి. మొత్తం 146 దేశాల సూచికలో భారత్‌ ర్యాంక్‌ 135! అఫ్గానిస్తాన్, పాకిస్తాన్, కాంగో, ఇరాన్, చాద్‌ తదితర దేశాలు అట్టడుగులు స్థానాల్లో నిలిచాయి. జెనీవాలోని ప్రపంచ ఆర్థిక వేదిక(డబ్ల్యూఈఎఫ్‌) ‘వార్షిక జెండర్‌ గ్యాప్‌ రిపోర్ట్‌–2022’ను బుధవారం చేసింది.

లింగ సమానత్వంలో ప్రపంచ దేశాలకు ర్యాంక్‌లను కేటాయించింది. లింగ అంతరం పూర్తిగా సమసిపోవడానికి మరో 132 ఏళ్లు పడుతుందని అంచనా వేసింది. లింగ సమానత్వంలో భారత్‌ వెనుకంజలో ఉన్నప్పటికీ ఆర్థిక వ్యవహారాలు, ఉద్యోగ–ఉపాధి అవకాశాల్లో వారి భాగస్వామ్యం పెరుగుతుండడం సంతోషకరమని పేర్కొంది. మహిళా ప్రజాప్రతినిధులు తదితరుల సంఖ్యలో పెరుగుదల కన్పించింది.
చదవండి: లంకాధ్యక్షుడి జంప్‌ జిలానీ.. గొటబయ గో! అంటే ముల్లేమూటా సర్దాల్సిందే!

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top