బాలీవుడ్‌ పాటకు దుమ్ములేపిన కొరియన్‌ బ్యాండ్‌ | Viral Video: Mashup Videos Of BTS Grooving On Chadhti Jawani | Sakshi
Sakshi News home page

బాలీవుడ్‌ పాటకు దుమ్ములేపిన కొరియన్‌ బ్యాండ్‌

Sep 19 2020 5:45 PM | Updated on Sep 19 2020 6:32 PM

Viral Video: Mashup Videos Of BTS Grooving On Chadhti Jawani  - Sakshi

BTS (బీటీఎస్‌).. దక్షిణ కొరియాలో ఫేమస్ బాయ్ బ్యాండ్. దీన్ని బ్యాంగ్టన్ బాయ్స్‌ అని కూడా పిలుస్తారు. 2010లో సియోల్‌లో ప్రారంభమైన బీటీఎస్.. ఇండియన్ సాంగ్స్‌కి మాషప్స్ చేస్తూ ఎంతో క్రేజ్ సంపాదించింది. తెలుగు, హిందీపాటలతోపాటు విభిన్న భాషల్లోని పాటలకు డాన్స్‌ చేయడం వీరి ప్రత్యేకం. ఈ బాయ్ బాండ్‌లో ఏడుగురు సభ్యులున్నారు. వీళ్లుచేసే ఒక్కే పార్ఫమెన్స్‌ ఒక్కో అద్భుతంగా ఉంటుంది. ఇప్పటికే ఎన్నో హిట్స్ సాంగ్స్‌కి డాన్స్ చేసి భారత్‌లోనూ క్రేజ్ సంపాదించుకుంది బీటీఎస్‌ బ్యాండ్‌. ఇటీవల అల్లు అర్జున్‌ బబ్లాక్‌ బాస్టర్‌ సినిమా ‘అల వైకుంఠపురములో’ సినిమా నుంచి బుట్టబొమ్మ పాటకు డాన్స్‌ చేసి దుమ్ములేపారు. (అంధాధున్‌ రీమేక్: టబు పాత్రలో నటించేది ఆమే!)

తాజాగా బాలీవుడ్‌ చాద్దీ జవానీ, తుమ్సే మిల్కే దిల్ కాపై అనే పాటలకు కూడా మాషప్‌  చేశారు. ఈ వీడియోను క్వాలిటాపోసస్ట్స్‌ అనే యూజర్‌ ట్విటర్‌లో షేర్‌ చేశారు. ఈ పాటకు బీటీఎస్‌ బ్యాండ్‌ సభ్యులు తమ స్టైల్లో అద్భుతమైన స్టెప్పులు వేసి ఆకట్టుకున్నారు. భాష రాకున్న స్టెప్పులతో ఇరగదీశారు. ఇక ఈ డ్యాన్స్‌పై నెటిజన్లు మనసు పారేసుకుంటున్నారు. చూడటానికి ఎంతో చక్కగా ఉందని ప్రశంసలు కురిపిస్తున్నారు.. ‘ఈ డాన్స్‌ చూస్తుంటే నాకు కూడా వీళ్లతో కలిసి స్టెప్పులు వేయాలనిపిస్తోంది.’ అంటూ ఓ నెటిజన్‌ కామెంట్‌ చేశారు. (సమంత ప్లేస్‌లో‘వరల్ఢ్‌ ఫేమస్‌ లవర్‌’ నటి)

Advertisement
 
Advertisement
Advertisement