అమ్మా దొంగా ఇక్కడున్నావా? చిన్నారి బిస్కెట్‌ దొంగతనం వైరల్‌

Viral Video: Dad Catches Her Cute Child While Eating Cookies - Sakshi

ఈ వీడియో చూస్తే స్ట్రెస్సంతా మటుమాయం

నవ్వులు తెప్పిస్తున్న చిన్నారి చిలిపి పని

బిస్కెట్ల డబ్బా తీసుకుని దాక్కుని తింటూ కూర్చున్న చిన్నారి వీడియో మురిపిస్తోంది. తనను గమనించిన తండ్రి వచ్చి చూడగా ఆ చిన్నారి ముసిముసిగా నవ్వుతూ బిస్కెట్‌ తింటుండడం నవ్వులు తెప్పిస్తోంది. ఆ చిన్నారి బిస్కెట్ల డబ్బా దొంగతనం నెటిజన్లను అమితంగా ఆకట్టుకుంటోంది. ఎక్కడి వీడియో తెలియదు కానీ పాప పేరు మాత్రం డైలీన్‌. కూతురిని పిలుస్తూ తండ్రి ‘డైలీన్‌ ఎక్కడ’ అంటూ వీడియో తీసుకుంటూ వెతుకు డైనింగ్‌ టేబుల్‌ పక్కన ఉన్న టేబుల్‌ వద్దకు వచ్చాడు.
చదవండి: ‘నా కోడిది హత్య.. న్యాయం చేయండి’ మాజీ ఎమ్మెల్యే తనయుడు

ఆ టేబుల్‌ పక్కన చిన్నారి ఒరియో బిస్కెట్‌ జాడీతో కనిపించింది. పాపను చూసి ఆ తండ్రికి నవ్వాగలేదు. తండ్రిని చూసిన డైలీన్‌ చిన్న నవ్వు నవ్వింది. అది అందరినీ ఆకట్టుకుంటోంది. ముసిముసి నవ్వు హృదయాలను పిండేస్తోంది. ‘ఏం చేస్తున్నావ్‌ డైలీన్‌? ఏం చేస్తున్నవ్‌’ అని రెండు మూడుసార్లు అడిగాడు. ఆ పాప నవ్వుతూ బిస్కెట్‌ నోట్లో పెట్టేసుకుంది. ‘ఇక చాలు. నీకు అన్నేసి బిస్కెట్లు అవసరం లేదు’ అని తండ్రి చెబుతున్నా పాప పట్టించుకోలేదు. ఈ సందర్భంగా తండ్రికి చేయి చాపి ఏదో చెప్పబోయింది. రెండేళ్ల పాప బిస్కెట్ల దొంగతనం వీడియోను అప్‌వర్తీ అనే ఇన్‌స్టాగ్రామ్‌లో కనిపించింది.
చదవండి: నీట్‌ బలిపీఠంపై మరో మరణం: సీఎం స్టాలిన్‌ దిగ్భ్రాంతి 

ఈ వీడియో నెటిజన్లను మురిసిపోయేలా చేసింది. చిన్నారి బోసినవ్వు హృదయానికి హాయి కల్పించేలా ఉంది. పాప అందంగా.. ఫన్నీ ఉందని ఒకరు కామెంట్‌ చేయగా.. ‘పాప నవ్వుకు నేను ఫిదా అయిపోయా’ అంటూ మరొకరు తెలిపాడు. మీరు కూడా ఆ పాప నవ్వు చూసేయండి. ఉన్న స్ట్రెస్సంతా మాయమైపోతుంది.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top