ఒక్క పనితో రియల్‌ హీరో అనిపించుకున్నాడు

Video Of Cop Saves Man Life Who Choking On Food Asks For Help - Sakshi

ఫ్లోరిడా : హిల్స్‌బరో కౌంటీ షెరిఫ్‌ ఆఫీస్‌లో డిప్యూటీ పోలీస్‌ ఆఫీసర్‌గా పనిచేస్తున్న క్లేటన్‌ రైడ్‌అవుట్‌ ఇప్పుడు ఫ్లోరిడా నగరంలో రియల్‌ హీరోగా నిలిచాడు. అతను రియల్‌ హీరో ఎందుకయ్యాడనేది ఈ వార్త చదివిన తర్వాత మీకే అర్థమవుతుంది. ఇక అసలు విషయంలోకి వెళ్తే..  పెట్రోలింగ్‌ విధుల్లో క్లేటన్‌  బిజీగా ఉన్నాడు. కాగా దారిలో ఒక కారులోంచి అదే పనిగా హారన్‌ మోగూతూనే ఉంది. దీంతో క్లేటన్‌ కారు దగ్గరికి వెళ్లి చూడగా.. అందులో ఒక వ్యక్తి ఊపిరి తీసుకోవడానికి చాలా ఇబ్బందులు పడుతున్నాడు. వెంటనే ఆ వ్యక్తిని కారు నుంచి బయటకు తీసిన క్లేటన్‌ 'హిమ్లిచ్‌ మాన్యూవర్‌' అనే శ్వాస ప్రక్రియ పద్దతి ఉపయోగించి అతని ప్రాణాలు కాపాడాడు.

హిమ్లిచ్‌ మాన్యూవర్‌ పద్దతిలో పొత్తి కడుపు, రిబ్‌కేజ్‌కు మధ్యలో చేతిని పెట్టి గట్టిగా పట్టుకొని బలంగా ఒత్తిడి అందిస్తుంటారు. ఈ ప్రక్రియతో శ్వాసనాళంలో ఏదైనా వస్తువు తట్టినప్పుడు అది క్లియర్‌గా మారి శ్వాస ప్రక్రియ మాములు స్థితికి వచ్చేస్తుంది. సరిగ్గా ఈ పద్దతినే క్లేటన్‌ ఆ వ్యక్తిపై ప్రయోగించి అతని ప్రాణాలు కాపాడాడు. కాగా ఆ వ్యక్తి మళ్లీ మాముల స్థితికి వచ్చాక అసలు విషయం చెప్పాడు. సాండ్‌విచ్‌ తింటుండగా గొంతుకు అడ్డం పడడంతో శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా మారిందని.. సమయానికి క్లేటన్‌ రాకపోయుంటే చనిపోయేవాడినేమో అంటూ తన ఆనందాన్ని వ్యక్తం చేశాడు. అయితే ఈ సంఘటన జరిగి చాలా రోజులే అయినా హిల్స్‌బరో కౌంటీ షెరిఫ్‌ ఆఫీస్‌ ఈ వీడియోనూ తాజాగా తమ ఫేస్‌బుక్‌ పేజీలో షేర్‌ చేయడంతో ఇప్పుడు వైరల్‌గా మారింది. క్లేటన్‌ రియల్‌ హీరో అనే పదానికి అర్థం చెప్పాడని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. 

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top