కలికాలం: భర్తకు విడాకులు.. మామతో వివాహం

USA Woman Marries Her Ex Husband Stepfather - Sakshi

అమెరికాలో చోటు చేసుకున్న సంఘటన

వాషింగ్టన్‌: పెళ్లిల్లు స్వర్గంలో నిశ్చయమవుతాయంటారు. ఒక్కసారి బ్రహ్మముడి పడితే.. ఏడేడు జన్మల వరకు వారిద్దరు భార్యాభర్తలుగానే ఉంటారని నమ్ముతారు. అయితే ఇప్పుడు పరిస్థితులు మారాయి. వైవాహిక జీవితం తాము అనుకున్నట్లు ఉంటే ఆ బంధాన్ని కొనసాగిస్తున్నారు. లేదంటే విడాకుల వైపు మొగ్గు చూపుతున్నారు. మరో విషయం ఏంటంటే.. పెళ్లైన తరువాత మరోకరితో ప్రేమలో పడటం.. వారితో కలిసి జీవించడం కోసం ఇప్పుడున్న బందాన్ని తెంచుకుంటున్నవారు కూడా ఉన్నారు సమాజంలో. ఈ నేపథ్యంలో తాజాగా ఓ వింత సంఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. ఓ మహిళ తన భర్తకు విడాకులు ఇచ్చి.. మామ(భర్త తండ్రి)ను వివాహమాడింది.

ఈ విచిత్ర సంఘటన అమెరికాలో చోటు చేసుకుంది. కెంటుకీలో హారోడ్స్బర్గ్ ప్రాంతంలో నివసిస్తున్న ఎరికా క్విగ్లే(31)కు ఆమె 16 ఏళ్ల వయస్సు ఉన్నప్పుడు జెఫ్(60) (ప్రస్తుతం ఆమె పెళ్లాడిన వ్యక్తి)తో పరిచయం ఏర్పడింది. జెఫ్‌ సవతి కుమార్తె(తన భార్య మొదటి భర్తకు పుట్టిన అమ్మాయి), ఎరికా ఇద్దరు స్నేహితులు. ఈ క్రమంలో ఆమెకు జెఫ్‌ సవతి కుమారుడు జస్టిన్‌తో పరిచయం ఏర్పడింది. అది కాస్త ప్రేమగా మారడంతో కొన్నేళ్ల క్రితం వారిద్దరు వివాహం చేసుకున్నారు. 

ఎరికా, జస్టిన్‌లకు ఓ బిడ్డ పుట్టాడు. కొన్నాళ్లు పాటు సాఫీగా సాగిన వారి సంసారంలో కలతలు వచ్చాయి. దాంతో వారు విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత ఎరికా జస్టిన్‌ సవతి తండ్రి జెఫ్‌తో ప్రేమలో పడింది. ఈ విషయాన్ని జెఫ్‌కు చెప్పంది. అతడు కూడా ఆమెను ప్రేమిస్తున్నానని చెప్పాడు. దాంతో ఎరికా తన కంటే 29 ఏళ్ల పెద్దవాడు.. ఒకప్పుడు తనకు మామ అయిన జెఫ్‌ను పెళ్లాడింది.

అయితే తొలుత జస్టిన్‌కు ఈ విషయం మింగుడు పడలేదు. కానీ తన మాజీ భార్య అంత ఒపెన్‌గా తన సవతి తండ్రిని ప్రేమిస్తున్నాని చెప్పడంతో అంగీకరించక తప్పలేదు. దాంతో కొన్నాళ్లు జస్టిన్‌కు భార్యగా సేవలందించిన ఆమె.. ఇప్పుడు తన మాజీ భర్తకు పిన తల్లిగా ఆ ఇంట్లో అడుగుపెట్టింది. అయితే, ఆమెకు పుట్టిన బిడ్డ బాధ్యతలను మాత్రం మాజీ భర్త జస్టిన్‌కే అందించింది. ఆ ముగ్గురు ఇప్పుడు ఒకే ఇంట్లో కలిసి జీవిస్తున్నారు. 

ఈ సందర్భంగా జస్టిన్‌ మాట్లాడుతూ.. ‘‘ప్రస్తుతం మా మధ్య అంతా బాగానే ఉంది. ఎరికా మీద నాకు ఎలాంటి కోపం లేదు. ఆమె తన మనసుకు నచ్చిన పని చేసింది. తన ఫీలింగ్స్‌ని నేను అర్థం చేసుకున్నాను. ఇక బిడ్డ బాధ్యతను నాకే అప్పగించినందుకు చాలా సంతోషంగా ఉంది’’ అన్నాడు. ఇక జెఫ్‌ మాట్లాడుతూ.. ‘‘నేను, ఎరికా చాలా సంతోషంగా ఉన్నాం. ప్రతిక్షణం ఆనందంగా గడుపుతున్నాం. మా ఇద్దరి మధ్య ఉన్న వయసు తేడాని మేం పట్టించుకోవడం లేదు. ప్రేమలో పడ్డాం.. దాన్ని పూర్తిగా ఆస్వాదిస్తున్నాం’’ అని తెలిపాడు. 

చదవండి: 
రెండు పెళ్లిళ్లు చేసుకుని తప్పు చేశా: నటి
అవును.. విడిపోయాం.. తొమ్మిదేళ్ల క్రితమే..

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top