అవును.. మేం విడిపోయాం.. అయితే..

Farah Khan Ali Says Happily Separated From Husband For 9 Years - Sakshi

ముంబై: ‘‘కొన్నిసార్లు ఇద్దరు మనుషుల మధ్య దూరం పెరుగుతుంది. మరికొన్ని సార్లు అంతే దగ్గరితనం కూడా ఉంటుంది. అయితే, తొమ్మిదేళ్ల క్రితమే నా భర్తతో వైవాహిక బంధం తెగిపోయింది. ఇప్పుడు మేం మంచి స్నేహితులం మాత్రమే’’ అని భర్త డీజే అకిల్‌ నుంచి విడిపోయినట్లు ప్రకటించారు ప్రముఖ ఆభరణాల రూపకర్త ఫరా ఖాన్‌ అలీ. బాలీవుడ్‌ హీరో హృతిక్‌ రోషన్‌ మాజీ భార్య సుసానే ఖాన్‌ సోదరి అయిన ఆమె, ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా సోమవారం ఈ విషయం వెల్లడించారు. తమ సంతానం ఫైజా, అజాన్‌ తమను అర్థం చేసుకున్నారని, కాబట్టి తాము సంతోషంగా విడిపోయినట్లు పేర్కొన్నారు. ఇది పూర్తిగా తమ సొంత నిర్ణయమని, ఇందులో మూడో వ్యక్తి ప్రమేయం లేదని చెప్పుకొచ్చారు.

ఈ మేరకు.. ‘‘భార్యాభర్తలుగా విడిపోయినా మేం ఎల్లప్పుడూ స్నేహితులుగా కొనసాగుతాం. రత్నాల్లాంటి పిల్లలకు మేం తల్లిదండ్రులం. వారిద్దరు మమ్మల్ని ఇకపై కూడా ఇలాగే ప్రేమిస్తామని చెప్పారు. మా నిర్ణయానికి మద్దతుగా నిలిచారు. గడిచిన కొన్నేళ్లుగా మేం దూరంగానే ఉంటున్నాం. అయితే ఇప్పుడు అందరికీ బహిరంగంగా ఈ విషయం చెప్పాల్సిన అవసరం వచ్చింది. అకిల్‌ ఎల్లప్పుడూ మా కుటుంబంలో సభ్యుడే. నేను తన కుటుంబంలో సభ్యురాలిని. మా శ్రేయోలాభిలాషులు అందరూ మా పరిస్థితి అర్థం చేసుకుంటారని భావిస్తున్నా. మా నిర్ణయాన్ని ఆమోదిస్తారని ఆశిస్తున్నా’’ అని ఫరా సుదీర్ఘ పోస్టు షేర్‌ చేశారు. కాగా అకిల్‌ సైతం ఇదే నోట్‌ను తన సోషల్‌ మీడియా అకౌంట్‌లో పంచుకున్నాడు. కాగా డీజే అకిల్‌- ఫరా 1999లో వివాహ బంధంతో ఒక్కటయ్యారు. వీరికి కుమార్తె ఫైజా, కుమారుడు అజాన్‌ ఉన్నారు.

చదవండి: వివాదాస్పద 'బాంబే బేగమ్స్‌' అసలు కథేంటి..?
నా కొడుకుతో సహా బిగ్‌బాస్‌కు వెళ్తా!: నటి

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top