ఇరాన్‌ చమురుపై ఆంక్షలు ఎత్తేసిన అమెరికా  | USA partially lifts Iran oil sanctions amid encouraging talks | Sakshi
Sakshi News home page

ఇరాన్‌ చమురుపై ఆంక్షలు ఎత్తేసిన అమెరికా 

Jun 23 2026 5:21 AM | Updated on Jun 24 2026 5:48 PM

USA partially lifts Iran oil sanctions amid encouraging talks

జూరిచ్‌: యుద్ధానికి ముగింపు పలికేందుకు అమెరికా–ఇరాన్‌ల మధ్య కుదిరిన 60 రోజుల మధ్యంతర ఒప్పందం అమలు మొదలయ్యింది. ఒప్పందం షరతుల్లో భాగంగా ఇరాన్‌ చమురుపై ఆంక్షలను ఎత్తివేస్తున్నట్లు అమెరికా ఆర్థిక శాఖ ప్రకటించింది. దీని ప్రకారం ఇరాన్‌ చమురు ఉత్పత్తి, సరఫరా, విక్రయాలకు ఇకపై ఎటువంటి ఆంక్షలు ఉండవు. ఈ వెసులుబాటు ఆగస్ట్‌ 21వ తేదీ వరకు అమల్లో ఉంటుందని అమెరికా ప్రభుత్వం తెలిపింది. సోమవారం స్విట్జర్లాండ్‌లో అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, ఇరాన్‌ ప్రతినిధుల మధ్య జరిగిన చర్చల్లో సానుకూల పురోగతి సాధించడంతో ఈ పరిణామం సాధ్యమైంది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement