అమెరికాలో ఒకే రోజు 13.5 లక్షల కేసులు | USA over 13 lakh Covid cases in one day | Sakshi
Sakshi News home page

అమెరికాలో ఒకే రోజు 13.5 లక్షల కేసులు

Jan 12 2022 5:56 AM | Updated on Jan 12 2022 5:56 AM

USA over 13 lakh Covid cases in one day - Sakshi

వాషింగ్టన్‌: అమెరికా ఒమిక్రాన్‌ బీభత్సానికి చిగురుటాకులా వణికిపోతోంది. రోజు రోజుకి కరోనా కేసుల సంఖ్య పెరిగిపోవడమే తప్ప తగ్గుదల కనిపించడం లేదు.  ప్రపంచంలోని మరే దేశంలో లేని విధంగా సోమవారం ఒక్కరోజే ఏకంగా 13 లక్షల 50 వేల కేసులు నమోదయ్యాయి. శని, ఆదివారాల్లో రాష్ట్రాలేవీ కేసులు రికార్డు చేయని కారణంగా సోమవారం నాటికి  తారాస్థాయికి కేసులు చేరుకుంటున్నాయి. గత 3 వారాల్లో ఆస్పత్రులో చేరే వారి సంఖ్య రెట్టింపు అయింది. వర్జీనియా, టెక్సాస్, కెంటకీ, కన్సాస్, చికాగోలలో వైద్యుల్ని ఇతర రాష్ట్రాల నుంచి తీసుకురావాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి.  

చైనాలో మరో నగరంలో లాక్‌డౌన్‌  
కోవిడ్‌–19 విలయానికి చైనాలో మూడో నగరం మూతబడింది. 55 లక్షల జనాభా ఉన్న అన్యాంగ్‌ నగరంలో లాక్‌డౌన్‌ విధించి మూకుమ్మడి పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే జియాన్, యుఝో నగరాల్లో లాక్‌డౌన్‌ విధించారు. మూడు అతిపెద్ద నగరాల్లో లాక్‌డౌన్‌ విధించడంతో దాదాపుగా 2 కోట్ల మంది ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు.

Advertisement
 
Advertisement
Advertisement