ఇరాన్‌ అక్రమ ఆయుధ రవాణాకు అమెరికా చెక్‌

US Navy seizes weapons bound for Yemen rebels - Sakshi

దుబాయ్‌: ఇరాన్‌ నుంచి యెమెన్‌కు ఆయుధాల అక్రమ రవాణాను అమెరికా అడ్డుకుంది. ఒమన్, పాకిస్తాన్‌ సమీపంలోని అరేబియా సముద్ర జలాల్లో వెళ్తున్న చేపలు పట్టే నౌకను అమెరికా నావికా దళాలు అడ్డగించి 1,400 కలష్నికోవ్‌ తరహా రైఫిళ్లు, మెషీన్‌ గన్స్, రాకెట్‌ గ్రనేడ్‌ లాంచర్లతోపాటు దాదాపు 2.3 లక్షల రౌండ్ల తూటాలను స్వాధీనం చేసుకున్నాయి. చాన్నాళ్లుగా అంతర్యుద్ధంతో సతమతమవుతున్న యెమెన్‌లోని హౌతీ రెబల్స్‌కు ఇచ్చేందుకు వీటిని తీసుకెళ్తున్నట్లు తెలుస్తోంది. సౌదీ నేతృత్వంలోని సంకీర్ణ దళాలపై హౌతీ రెబల్స్‌ పోరు కొనసాగిస్తున్నారు. ఆయుధాలను అమెరికా క్షిపణి విధ్వంసక యూఎస్‌ఎస్‌ ఓకేన్‌ యుద్ధ నౌకలోకి ఎక్కించి, చేపల పడవను సముద్రంలో ముంచేశారు.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top