జార్జియా, నెవెడాలో దూసుకుపోతున్న బైడెన్‌

US Election 2020 Joe Biden Ahead Of Donald Trump In Georgia - Sakshi

పూర్తిగా సన్నగిల్లిన ట్రంప్‌ గెలుపు అవకాశాలు

వాషింగ్టన్‌: అమెరికాలో అధ్యక్ష ఎన్నికల కౌంటింగ్‌ ప్రక్రియ కొనసాగుతోంది. ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌నకు అందనంత దూరంలో ఉన్న డెమొక్రటిక్‌ పార్టీ అభ్యర్థి జో బైడెన్‌ జార్జియా, నెవెడాలోనూ దూసుకుపోతున్నారు. దీంతో మరోసారి అగ్రరాజ్య పగ్గాలు చేపట్టాలన్న ట్రంప్‌ గెలుపు అవకాశాలు పూర్తిగా సన్నగిల్లాయి. కాగా జార్జియా(16)లో ఇప్పటికే 99శాతం ఓట్లు లెక్కింపు పూర్తైంది.

ఇక ప్రస్తుత ట్రెండ్‌ ఇలాగే కొనసాగితే జార్జియా, బైడెన్‌కే దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒకవేళ అక్కడ గనుక గెలుపు ఖాయమైతే అమెరికా అధ్యక్ష పీఠం బైడెన్‌ సొంతమవుతుంది. ఇక నెవెడాలోనూ గెలిచినట్లయితే బైడెన్‌ 290 ఓట్ల వరకు గెలుచుకునే అవకాశం ఉంది. జార్జియా ఫలితం వెలువడినట్లయితే, ప్రపంచానికి ‘పెద్దన్న’, అమెరికా కాబోయే అధ్యక్షుడు ఎవరన్న ఉత్కంఠకు నేడే తెర పడనుంది.( చదవండి: ‘‘చిల్ డొనాల్డ్‌ చిల్‌’’ ట్రంప్‌కు గట్టి కౌంటర్‌)

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top