అరుణాచ‌ల్‌ ప్రదేశ్‌లో 100 ఇళ్లను నిర్మించుకున్న చైనా!

US Defence Report Mentions Chinese Village In Arunachal Reported By NDTV - Sakshi

న్యూఢిల్లీ: భార‌త్‌-చైనా స‌రిహ‌ద్దుల్లో ఉద్రిక్త‌త‌లు కొనసాగుతున్న నేపథ్యంలో అమెరికా రక్షణశాఖ విడుదల చేసిన వార్షిక నివేదికలో ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. వాస్తవాధీన రేఖ (లైన్‌ ఆఫ్‌ ఆక్చువల్‌ కంట్రోల్‌) దాటి వచ్చిన చైనా అరుణాచల్ ప్రదేశ్‌లో 100 ఇళ్లతో కొత్త గ్రామాన్ని సృష్టించుకుంది. దీనికి సంబంధించిన నివేదికను యూఎస్‌ కాంగ్రెస్‌కు సమర్పించింది. భారత భూ భాగంగా పేర్కొంటున్న ప్రాంతంలోనే చైనా ఈ నిర్మాణం చేపట్టింది.
చదవండి: కుప్పకూలిన 21 అంత‌స్తుల భ‌వ‌నం: 36కు చేరిన మృతుల సంఖ్య

మెక్న్‌మోహన్‌ రేఖ‌కు ద‌క్షిణాన భార‌త స‌రిహ‌ద్దుల్లో ఈ గ్రామం నిర్మించార‌ని బ‌య‌ట‌ప‌డింది. అరుణ‌చ‌ల్‌ప్ర‌దేశ్‌లో డ్రాగన్‌ దేశం ఒక గ్రామాన్నే నిర్మించిన విష‌య‌మై ఉప‌గ్ర‌హ చాయాచిత్రం ఆధారంగా జాతీయ మీడియా (ఎన్డీటీవీ) ఈ ఏడాది ప్రారంభంలో ఓ వార్తాకథ‌నం ప్ర‌చురించింది. ‘2020లో, పీఆర్‌సీ (పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా) ఎల్‌ఏటీ  తూర్పు సెక్టార్‌లో టిబెట్‌ అటానమస్ రీజియన్, భారత్‌లోని అరుణాచల్‌ ప్రదేశ్‌ మధ్య వివాదాస్పద భూభాగంలో 100 ఇళ్లతో ఓ గ్రామాన్ని నిర్మించింది’ అని నివేదిక పేర్కొంది.
చదవండి: మరో మహిళతో భర్త ఫోటోలు: ఐదుగురు పిల్లలను బాత్‌టబ్‌లో ముంచి

ఈ గ్రామం అరుణాచల్ ప్రదేశ్‌లోని ఎగువ సుబాన్‌సిరి జిల్లాలోని సారి చు నది ఒడ్డున ఉంది. ఈ ప్రాంతం 1962 యుద్ధానికి ముందు కూడా భారతదేశం- చైనా సైనికుల మధ్య ఘర్షణలను దారితీసింది. చైనా ఒక దశాబ్దానికి పైగా ఈ ప్రాంతంలో చిన్న సైనిక స్థావరాన్ని నిర్వహిస్తోంది. అయితే భారత భూభాగంలోకి మరింత చొచ్చుకొని 2020లో అది పూర్తి స్థాయి గ్రామాన్ని నిర్మించుకుంది. అంతేగాక అదే ప్రాంతంలో రహదారి నిర్మాణాలు కూడా ఏర్పాటు చేస్తోంది. సరిహద్దు ఉద్రిక్తతలను తగ్గించడానికి దౌత్య, సైనిక సంభాషణలు, చర్చలు కొనసాగుతున్నప్పటికీ ఎల్ఏసీ వద్ద చైనా వ్యూహాత్మక చర్యలను కొనసాగిస్తోందని అమెరికా నివేదిక పేర్కొంది.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top