అఫ్గానిస్తాన్‌లో ఆధిపత్య పోరు.. అమెరికా గగనతల దాడులు

US Carried Out Airstrikes In Afghanistan, Says Pentagon - Sakshi

వాషింగ్టన్‌: తాలిబన్లపై పోరాటం సాగిస్తున్న అఫ్గాన్‌ ప్రభుత్వ దళాలకు మద్దతుగా తాము గగనతల దాడులు నిర్వహించినట్లు అమెరికా రక్షణ శాఖ తాజాగా వెల్లడించింది. అఫ్గానిస్తాన్‌ నుంచి తమ సేనలు వైదొలిగేందుకు గడువు సమీపిస్తుండటం, ఆ దేశంలోని సగానికి పైగా జిల్లాలు తాలిబన్ల స్వాధీనం అయినట్లు వార్తలు వెలువడుతున్న సమయంలో అగ్రరాజ్యం ఈ ప్రకటన చేయడం గమనార్హం. అయితే, ఈ దాడుల వివరాలను తెలిపేందుకు నిరాకరించింది.

ఆ ప్రాంతంలోని సెంట్రల్‌ కమాండ్‌ జనరల్‌ కెన్నెత్‌ ఫ్రాంక్‌ మెకంజీ ఆదేశాల మేరకే ఇవి జరిగాయనీ, అఫ్గాన్‌ బలగాలకు మద్దతుగా ఇలాంటి మున్ముందు కూడా దాడులు కొనసాగుతాయని పెంటగాన్‌ ప్రతినిధి జాన్‌ కిర్బీ తెలిపారు. 20 రోజుల్లో సుమారు 7 డ్రోన్‌ దాడులు జరిగినట్లు సీఎన్‌ఎన్‌ వెల్లడించింది. ప్రభుత్వ బలగాల నుంచి ఎత్తుకుపోయిన సామగ్రిని స్వాధీనం చేసుకు నేందుకు, శత్రువులు, శత్రు బలగాలే లక్ష్యంగా చేసుకుని ఈ దాడులు జరిపినట్లు మీడియా పేర్కొంది.  

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top