
Name Will be Business Brand: ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్‌స్కీ పేరు ప్రపంచవ్యాప్తంగా మారుమోగిపోతోంది. రష్యా దాడులకు వెరవకుండా అగ్రరాజ్యం అమెరికా విమానం పంపిస్తాం మా దేశానికి వచ్చేయండంటూ ఆఫర్లు ఇచ్చినా స్వదేశం కోసం తుపాకీ చేతబట్టి అందరి దృష్టిలోనూ హీరో అయిపోయారు. ఇదే ఆయనకు బ్రాండ్ ఇమేజ్ తెచ్చిపెట్టింది. దానిని క్యాష్ చేసుకునే ప్రయత్నాలు ఊపందుకున్నాయి.
జెలెన్‌స్కీ ఫొటో, ‘ఐ నీడ్ అమ్యునిషన్, నాట్ ఏ రైడ్’అనే ఆయన మాటలున్న టీ షర్టులకు గిరాకీ పెరిగిపోయింది. అమెజాన్ వేదికగా ఈ టీషర్టులను 20 డాలర్లు(సుమారు రూ.1,500)కు జనం వేలం వెర్రిగా కొనుక్కుంటున్నారు. ఉక్రెయిన్‌కు మద్దతు తెలిపేందుకు, జనం జెలెన్‌స్కీ ఫొటోలున్న టీషర్టులను, చెవి రింగులు, జెండాలను కొంటున్నారని వ్యాపారులు అంటున్నారు.