రష్యాతో అనుసంధానం చేసే క్రిమియా బ్రిడ్జిపై భారీ పేలుడు.. అనాధగా మిగిలిన చిన్నారి..  

Ukraine War Explosion On Crimea Bridge 2 Killed - Sakshi

క్యివ్: గతేడాది అక్టోబర్ నెలల్లో ట్రక్కు బాంబు పేలిన అదే బ్రిడ్జి మీద మరోసారి పేలుడు సంభవించింది. ఈ సంఘటనలో ఒక జంట మృతి చెందగా వారి బిడ్డ మమ్మీ, డాడీ అంటూ రోదిస్తూ హృదయాలను ద్రవింపజేసింది. 

క్రిమియా నుండి రష్యాకు కనెక్టివిటీగా ఉన్న ఈ బ్రిడ్జి రష్యా యుద్ధం చేయడంలో నిర్ణయాత్మక పాత్ర పోషించింది. 12 కిలోమీటర్ల పొడవున్న ఈ రోడ్డు కమ్ రైలు వంతెన రష్యా దళాలు వస్తూ పోతూ ఉండడానికి బాగా ఉపయోగపడింది. గత ఏడాది అక్టోబర్ నెలలో ఇదే బ్రిడ్జిపై ట్రక్కు బాంబు పేలిన విషయం తెలిసిందే. దీన్ని మరమ్మతులు చేసి పునరుద్ధరించడానికి నెలల సమయం పట్టింది. ఎట్టకేలకు రవాణా యధాతధంగా సాగుతున్న ఈ బ్రిడ్జి మీద మళ్ళీ పేలుడు సంభవించడం సంచలనంగా మారింది. 

ఈ ప్రమాదంలో ఒక జంట మృతి చెందారని వారి చిన్నారి మాత్రం చిన్న చిన్న గాయాలతో బయటపడిందని తెలిపారు పశ్చిమ రష్యాలోని బెల్గోరోడ్ గవర్నర్ వ్యాచెస్లావ్ గ్లాడ్కోవ్. బెల్గోరోడ్ నెంబర్ ప్లేటు ఉన్న వాహనం ఒకటి ఈ పేలుడుకు ప్రధాన కారణమని అన్నారు. రష్యా రవాణా మంత్రిత్వ శాఖ ఇది ముమ్మాటికీ ఉక్రెయిన్ చర్యేనని ఆరోపిస్తూ పేలుడుకి గల కారణాలను విచారిస్తున్నట్లు తెలిపింది. 

క్రిమియా గవర్నర్ సెర్జీ ఆక్సియోనోవ్ ఈ విషయాన్ని టెలిగ్రామ్ ద్వారా ధృవీకరించి రక్షణ చర్యలు చేపట్టామని తెలిపారు. బ్రిడ్జి 145 పిల్లర్ వద్ద పేలుడు సంభవించిందని, బ్రిడ్జి రహదారిపై విపత్తు నిర్వహణ సంస్థల వారు రక్షణ చర్యలు చేపట్టారని. వీలైనంత తొందరగా ట్రాఫిక్ కు అంతరాయం లేకుండా చేస్తామని తెలిపారు.  

ఇది కూడా చదవండి: పసిఫిక్ సముద్రంలో చిక్కుకుని.. 60 రోజుల పాటు ఒక్కడే..   

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top