
లండన్: మనీల్యాండరింగ్ ఆరోపణలపై భారత్‌కు తనను అప్పగించాలంటూ బ్రిటన్ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేసే మరో అవకాశం వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీకి దక్కింది. తాను నిరాశ నిస్పృహలో ఉన్నానని, మానసిక ఆరోగ్యం సరిగాలేదని, ఆత్మహత్య చేసుకోవాలనేంతగా కుంగిపోయానని ఆయన పెట్టుకున్న అభ్యర్థనను లండన్‌లోని హైకోర్టు పరిగణనలోకి తీసుకుంది. నీరవ్ తరఫు లాయర్లు తమ వాదనలను జడ్జికి వినిపించారు. ‘ బ్రిటన్‌లోని క్రిమినల్ జస్టిస్ యాక్ట్–2003,యూరప్‌లోని మానవ హక్కుల పరిరక్షణ, జీవించే హక్కులను పరిగణనలోకి తీసుకుని అప్పీల్ చేసుకునేందుకు అవకాశం ఇస్తున్నా’ అని జడ్జి వ్యాఖ్యానించారు.