పాతకాలం విమానం కుప్పకూలి ఇద్దరి మృతి | Two People Deceased As Vintage Plane Crashes During Southern California Airfield | Sakshi
Sakshi News home page

పాతకాలం విమానం కుప్పకూలి ఇద్దరి మృతి

Published Mon, Jun 17 2024 9:50 AM | Last Updated on Mon, Jun 17 2024 10:59 AM

Two people deceased As Vintage Plane Crashes During Southern California Airfield

కాలిఫోర్నియా: ఫాదర్స్‌ డే సందర్భంగా అమెరికాలోని కాలిఫోర్నియాలో నిర్వహించిన వేడుకల్లో విషాదం చోటుచేసుకుంది. ఆదివారం సదరన్‌  కాలిఫోర్నియా ఎయిర్‌ఫీల్డ్‌కు చెందిన ఎయిర్‌ మ్యూజియం నిర్వహించిన వేడుకల్లో పాత కాలపు విమానం కుప్పకూలటంతో ఇద్దరు మృతి చెందారు.

 

ఈ విషయాన్ని ఎయిర్‌ మ్యూజియం అధికారులు వెల్లడించారు. శాన్ బెర్నార్డినో కౌంటీలోని చినో ఎయిర్‌ పోర్టుకు పశ్చిమాన శనివారం మధ్యాహ్నం 12:30 గంటల ట్విన్-ఇంజిన్ లాక్‌హీడ్ 12A విమానం కూలిపోయిందని ఫెడరల్‌ ఏవియేషన్‌ అడ్మినిస్ట్రేషన్‌  అధికారులు తెలిపారు.

చాలా పురాతనమైన ఈ విమానం యాంక్స్‌  ఎయిర్‌ మ్యూజియానికి చెందినదిగా అధికారులు తెలిపారు.  యాంక్స్‌ మ్యూజియం అనేక​ పురాతన విమానాలకు కలిగి ఉందని తెలిపారు. ఈ ఘటనపై నేషనల్‌ ట్రాన్స్‌పోర్టు సేఫ్టీ బోర్డు  దర్యాప్తు చేపట్టింది. అయితే మృతి చెందిన వారి వివరాలును అధికారులు వెల్లడించింది.    
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement