పారిపోయిన తాబేలు..74 రోజుల తిరిగొచ్చింది

Tortoise Missing For 74 Days Spotted Hardly One Mile Away From Home In US - Sakshi

తాబేలు.. చిట్టి పొట్టి అడుగులు వేసుకుంటా బుజ్జిబుజ్జిగా నడిచే జీవి. మెల్లగా నడిచేవారిని తాబేలులాగే ఏంటా నడక అంటారు. అది ఎంత మెల్లగా నడుస్తుందంటే..  దాదాపు రెండున్నర నెలల్లో ఒక మైలు దూరం కూడా వెళ్లలేనంత. అవును.. 68 కిలోల ఓ తాబేలు, 74 రోజుల్లో మైలు దూరం కూడా పరుగెత్తలేకపోయింది. ఫలితంగా తిరిగి తన యజమాని దగ్గరకు వచ్చి బంధీ అయింది. 

వివరాల్లోకివెళితే.. అమెరికా టెన్నెస్సీ రాష్ట్రంలోని యాష్లాండ్ సిటీకి చెందిన లిన్ కోల్ అనే మహిళ సోలొమాన్ అనే తాబేలును పెంచుకుంటోంది. 15 ఏళ్ల వయసు గల ఆ తాబేలు రెండు నెలల క్రితం కనిపించకుండా పోయింది. దీంతో లిన్ కోల్ ఆందోళనకు గురై.. తాబేలు కనిపించడం లేదనే స్టిక్కర్లను చుట్టుపక్కల ఏర్పాటుచేసింది. కొద్ది రోజుల పాటు చుట్టు పక్కల వెతికినా ఫలితం లేకపోయింది. (చదవండి : బాక్స్‌ ఓపెన్‌ చేస్తే.. అనుకోని అతిథి)

అయితే 74 రోజుల తరువాత లిన్ కోల్ ఇంటి సమీపంలోని ఓ వ్యాలీ కన్‌స్ట్రక్షన్ సైట్ వద్ద ఓ వ్యక్తికి తాబేలు కనిపించింది. వెంటనే లిన్ కోల్‌కు ఫోన్ చేసి ఆమె ఇంటికి వచ్చి మరీ ఆ వ్యక్తి తాబేలును అందజేశాడు. అయితే ఈ 74 రోజుల్లో అది కేవలం ఒక మైలు దూరం కూడా వెళ్లకపోవడం విశేషం. తన తాబేలు దొరకడం ఎంతో ఆనందంగా ఉందని.. తన పెంపుడు తాబేలును మళ్లీ చూస్తానని అనుకోలేదని లిన్ కోల్ పేర్కొంది. యజమానికి ఆనందం ఉన్నప్పటీకీ.. తాబేలుకి మాత్రం పరుగెత్తలేక దొరికిపోయానన్న బాధ ఉండే ఉంటుంది. 

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top