టుడే ట్రెండింగ్‌ & టాప్‌ 10 ఈవెనింగ్‌ న్యూస్‌ | Sakshi
Sakshi News home page

టుడే ట్రెండింగ్‌ & టాప్‌ 10 ఈవెనింగ్‌ న్యూస్‌

Published Sun, May 29 2022 5:00 PM

Top10 Telugu Latest News Evening Headlines 29th May 2022 - Sakshi

1.. Nepal Plane Missing: నేపాల్‌లో అదృశ్యమైన విమానం ఆచూకీ గుర్తింపు


నేపాల్‌లో అదృశ్యమైన విమానం ఆచూకీని లభించింది. తారా ఎయిర్‌కు చెందిన విమానం పర్వతాల్లో కూలినట్లు తెలిసింది. కొవాంగ్‌ సమీపంలో విమాన శకలాలను అధికారులు గుర్తించారు.  పోఖారా నుంచి నేపాల్‌లోని జోమ్‌సోమ్‌కు వెళ్తుండగా ప్రమాదం చోటుచేసుకుంది.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

2.. చంద్రబాబుకు మంత్రి పెద్దిరెడ్డి సవాల్‌..


 టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు విద్యుత్‌ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సవాల్ విసిరారు. టీడీపీ అధికారంలో ఉన్న 2014 నుంచి 2019 దాకా రాష్ట్రంలో ఏం అభివృద్ధి చేశారో చంద్రబాబు చెప్పాలని డిమాండ్‌ చేశారు. ఆన్‌లైన్‌ మ్యానిఫెస్టో తొలగించిన చరిత్ర టీడీపీదేనని మండిపడ్డారు.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

3.. వారి చేతికి కూడా తుపాకీ ఇవ్వండి: ట్రంప్‌


 టెక్సాస్‌ యువాల్డే రాబ్‌ ఎలిమెంటరీ స్కూల్‌ మారణహోమం గురించి అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు ట్రంప్‌ హ్యూస్టన్‌లోని నేషనల్ రైఫిల్ అసోసియేషన్ సమావేశంలో మాట్లాడుతూ...తుపాకితో కాల్పులకు పాల్పడుతున్న చెడ్డ వ్యక్తిని నియంత్రించాలంటే మంచి వ్యక్తి కూడా తుపాకిని చేతబట్టాల్సిందేనని అన్నారు.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

4.. సామాజిక న్యాయభేరీ: నాల్గో రోజు బస్సు యాత్ర


నంద్యాలలో ప్రారంభమైన ఆదివారం నాటి సామాజిక న్యాయభేరీ బస్సు యాత్ర.. అనంతపురానికి చేరుకుంది. మంత్రులకు వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. నంద్యాల నుంచి ప్రారంభమైన బస్సు యాత్ర సాయంత్రానికి అనంతపురంలో బహిరంగ సభతో ముగియనుంది. 
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

5.. Masked Aadhaar Card: ఆధార్‌ కార్డు వాడకంపై కేంద్రం కీలక సూచన.. ఇలా చేయండి


దేశంలో ప్రతీ పనికి ఆధార్‌ను ఉపయోగిస్తున్న విషయం తెలిసిందే. సిమ్‌ కార్డు నుంచి బ్యాంక్‌ ఖాతాల వరకు ఆధార్‌ తప్పనిసరి అయిపోయింది. ఆధార్‌ కార్డు లేనిదే కొన్ని పనులు జరగవు. ఈ నేపథ్యంలో ఆధార్‌ వాడకంపై కేంద్రం.. దేశ పౌరులకు కీలక సూచన చేసింది. 
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

6.. కొండాపూర్‌లో దారుణం.. యువతిని బంధించి, అత్యాచారయత్నం


సాక్షి, హైదరాబాద్‌: కొండాపూర్‌లోని శ్రీరామ్‌నగర్‌లో దారుణం వెలుగు చూసింది. తన భర్తతో వివాహేతర సంబంధం ఉందనే అనుమానంతో యువతిని కిడ్నాప్‌ చేయించింది ఓ మహిళ. వివరాల్లోకెళితే.. గాయత్రి, శ్రీకాంత్‌ భార్యభర్తలు. మరో యువతితో శ్రీకాంత్‌ సన్నిహితంగా ఉండటంతో ఇద్దరిపై భార్య గాయత్రి అనుమానం పెంచుకుంది. ఈ క్రమంలో యువతిని ఇంటికి పిలిపించి బంధించింది.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

7.. Dhaakad Movie: బడ్జెటేమో రూ. 90 కోట్లు.. అమ్ముడైన టికెట్లు 20 మాత్రమే..


బాలీవుడ్‌ కాంట్రవర్సీ బ్యూటీ కంగనా రనౌత్ తాజాగా నటించిన చిత్రం ధాకడ్‌.  రజ్‌నీష్‌ ఘాయ్‌ దర్శకత్వం వహించిన ఈ యాక్షన్‌ మూవీ మే 20న గ్రాండ్‌గా విడుదలైంది. సినిమా టీజర్‌, ట్రైలర్‌ మూవీపై భారీ అంచనాలను నెలకొల్పింది. ధాకడ్‌ మూవీలో యాక్షన్‌ హీరోయిన్‌గా బాలీవుడ్‌లో సత్తా చాటుతుందని అనుకున్నారు. కానీ అందుకు భిన్నంగా అంచనాలన్నీ తారుమారయ్యాయి. 
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

8.. IPL 2022: ఫైనల్‌కు 6000 ‍మంది పోలీసులతో భారీ భద్రత.. కారణం అదేనా?


ఐపీఎల్‌-2022 తుది సమరానికి రంగం సిద్దమైంది. ఫైనల్‌ పోరులో అహ్మదాబాద్‌ వేదికగా ఆదివారం గుజరాత్‌ టైటాన్స్‌, రాజస్తాన్‌ రాయల్స్‌ తలపడనున్నాయి. కాగా ఫైనల్ మ్యాచ్ ను ప్రత్యక్షంగా వీక్షించేందుకు భారత దేశ ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా, గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ స్టేడియానికి రానున్నట్లు సమాచారం.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

9.. వారానికి 4 రోజుల పని, సై..సై..అంటున్న ఉద్యోగులు!


ప్రపంచ దేశాల్ని కలవరానికి గురి చేస్తున్న దిగ్రేట్‌ రిజిగ్నేషన్‌, అట్రిషన్‌ రేట్‌ నుంచి సురక్షితంగా ఉండేందుకు సంస్థలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నాయి. ఇందులో భాగంగా పదుల సంఖ్యలో కంపెనీలు వర‍్కింగ్‌ డేస్‌ను తగ్గించేస్తున్నాయి.వారానికి 5రోజులు కాకుండా 4రోజుల పాటు వర్క్‌ చేసే అవకాశాన్ని కల్పిస్తున్నాయి.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

10.. పైనాపిల్‌ కీరా జ్యూస్‌ తాగుతున్నారా.. ఇందులోని బ్రోమెలైన్‌ అనే ఎంజైమ్‌ వల్ల!


Summer Drinks- Pineapple Keera Juice: పైనాపిల్, కీరా ముక్కల్లో విటమిన్‌ సి, ఐరన్‌ పుష్కలంగా ఉంటాయి. ఇవి రెండు చర్మాన్ని పొడిబారనియకుండా కాపాడతాయి. విటమిన్‌ సి ప్రోటిన్‌తో కలిసి ముఖం మీద ముడతలు రాకుండా చేయడంలో కీలక పాత్ర పోషిస్తుంది. సెబేసియస్‌ గ్రంథుల పనితీరు మెరుగుపడి, చర్మం తేమగా ఉంటుంది.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

Advertisement
 
Advertisement
 
Advertisement