Trending Top 10 News: టుడే ట్రెండింగ్‌ & టాప్‌ 10 న్యూస్‌

Top 10 Telugu Latest News Evening Headlines Today 27th April 2022 5 PM - Sakshi


1. అన్నంత పని చేసిన పుతిన్‌.. గ్యాస్‌ నిలిపివేత
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ అన్నంత పని చేశారు. సహజ వాయువు కావాలంటే రష్యన్‌ కరెన్సీ రూబుల్స్‌లోనే చెల్లింపులు చేయాలంటూ ఆయన మిత్రపక్షాలు కానీ దేశాలను డిమాండ్‌ చేసిన సంగతి తెలిసిందే. ఈ హెచ్చరికలను ఇప్పుడు నిజం చేశారాయన. 
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి


2. పెట్రోల్‌ ధరలపై తొలిసారి పెదవి విప్పిన ప్రధాని మోదీ
దేశంలో పెరుగుతున్న పెట్రోల్‌ ధరలపై మోదీ సంచలన వ్యాఖ్యలు చేశారు. కొన్ని రాష్ట్రాలు మాత్రమే పెట్రోల్‌పై వ్యాట్‌ తగ్గించాయని.. ఇప్పటికైనా పన్నులు తగ్గించాలని మిగతా రాష్ట‍్రాలను కోరుతున్నానని అన్నారు. సమాఖ్య స్ఫూర్తితో పెట్రోల్‌పై పన్నులు తగ్గించండని స్పష్టం చేశారు.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి
 

3. వైద్య, ఆరోగ్య శాఖపై సమీక్ష.. సీఎం జగన్‌ ఏమన్నారంటే..?
కోవిడ్‌ పరిస్థితులపై వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వర్చువల్‌ సమావేశం నిర్వహించారు. తాడేపల్లి క్యాంప్‌ కార్యాలయం నుంచి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాల్గొన్నారు. వివిధ రాష్ట్రాల్లో పెరుగుతున్న కరోనా కేసుల దృష్ట్యా తీసుకోవాల్సిన చర్యలపై సమావేశంలో చర్చ జరిగింది.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి
 

4. గవర్నర్‌ వ్యవస్థను దుర్మార్గం చేశారు.. ఎన్టీఆర్‌ టైంలో జరిగింది గుర్తు లేదా?
రాజ్యాంగానికి లోబడి ఉండాల్సిన గవర్నర్‌ వ్యవస్థను.. ఇప్పుడు దుర్మార్గంగా మార్చేశారని సీఎం కేసీఆర్‌ ఆక్షేపించారు. హైదరాబాద్‌లో జరిగిన టీఆర్‌ఎస్‌ ప్లీనరీలో ఆయన ప్రసంగింస్తూ ఘాటు విమర్శలు చేశారు.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి
 


5.వేలానికి విరాట్‌ కోహ్లి జెర్సీ.. ధర ఎంతంటే
ఇంగ్లీష్‌ క్రికెట్‌ మీడియా విజ్డెన్‌ విరాట్‌ కోహ్లి జెర్సీని వేలం వేయనుంది. కోహ్లి సంతకంతో కూడిన జెర్సీని ఒక ఫోటో ఫ్రేమ్‌లో పెట్టింది. జెర్సీతో పాటు కోహ్లికి సంబంధించిన ఫోటోలను కూడా ఫ్రేమ్‌లో ఉంచింది. 
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి
 


6. అదరగొట్టిన నటరాజ్‌ మాస్టర్‌.. షాక్‌ అయిన హౌస్‌మేట్స్‌
బిగ్‌బాస్‌ నాన్‌స్టాప్‌ మంగళవారం నాటి ఎపిసోడ్‌ మరింత ఇంట్రెస్టింగ్‌గా సాగింది. కెప్టెన్సీ కంటెండర్స్‌ కోసం బిగ్‌బాస్‌ ఇచ్చిన కిల్లర్‌ టాస్క్‌లో నటరాజ్‌ మాస్టర్‌ మ్యాన్‌ ఆఫ్‌ ది షోగా నిలిచాడు. 
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి
 

7. జోరుగా పోర్షె కార్ల అమ్మకాలు..ఎక్కువగా సేల్‌ అవుతున్న కార్లు ఇవే!
స్పోర్ట్స్‌ కార్ల తయారీ సంస్థ పోర్ష.. ఈ ఏడాది జనవరి–మార్చిలో భారత్‌లో 188 కార్లను విక్రయించింది. గతేడాది ఇదే కాలంతో పోలిస్తే ఇది 22 శాతం అధికం. ఎస్‌యూవీలైన కయెన్, మకాన్‌ విజయవంతంగా తమ ప్రస్థానాన్ని కొనసాగిస్తున్నాయని కంపెనీ తెలిపింది. 
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి
  

8. అరుదైన లాంతరు.. ఉప్పునీటితో వెలుగుతుంది 
దీపం వెలగాలంటే ఏం కావాలి? పాతకాలం దీపాలకైతే, నూనె కావాలి. ఇప్పటి దీపాలకైతే కరెంటు కావాలి. కనీసం బ్యాటరీ కావాలి. ఈ ఫొటోలో కనిపిస్తున్న లాంతరుదీపానికి మాత్రం ఉప్పునీరు ఉంటే చాలు. 
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి
 


9. ట్రంప్‌ రోజూ రూ. 7లక్షల జరిమానా కట్టాలటా! ఎందుకో తెలుసా? 
అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌కి యూఎస్‌ కోర్టు భారీ షాక్ ఇచ్చింది. ట్రంప్‌ వ్యాపార లావాదేవీలకు సంబంధించిన పత్రాలను న్యూయార్క్‌ అటార్నీ జనరల్ కార్యాలయానికి సమర్పించే వరకు ప్రతి రోజు సుమారు రూ. 7లక్షల వరకు జరిమాన కట్టాలని ఆదేశించింది.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి


10. ‘చంద్రబాబు, ఆయన అనుచరులవి పది తప్పులు’
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, ఆ పార్టీ నేత బోండా ఉమాకు నోటీసులు ఇచ్చామని మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ వాసిరెడ్డి పద్మ అన్నారు. వారు చేసిన తప్పులు ఏంటో మీడియా ద్వారా చెప్తున్నామని అన్నారు. చంద్రబాబు, ఆయన అనుచరులవి పది తప్పులు ఉన్నాయని ఆమె మీడియాకు వివరించారు.  
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top