ట్రంప్‌ రోజూ రూ. 7లక్షల జరిమానా కట్టాలటా! ఎందుకో తెలుసా?

Donald Trump Must Pay 10000 Dollars Daily Fine  - Sakshi

Trumpobeys a subpoena and surrenders documents relating to his business: అమెరికా మాజీ అధ్యక్షుడు, వివాదాస్పద నాయకుడుగా తరచు వార్తలో నిలిచే డోనాల్డ్‌ ట్రంప్‌కి యూఎస్‌ కోర్టు భారీ షాక్ ఇచ్చింది. ట్రంప్‌ వ్యాపార లావాదేవీలకు సంబంధించిన పత్రాలను న్యూయార్క్‌ అటార్నీ జనరల్ కార్యాలయానికి సమర్పించే వరకు ప్రతి రోజు సుమారు రూ. 7లక్షల వరకు జరిమాన కట్టాలని ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తి ఎంగోరోన్‌ మాట్లాడుతూ...2019 విచారణలో ట్రంప్‌ తన ఆర్థిక ప్రయోజనాల కోసం తన ఆస్తుల విలువను తప్పుగా చూపించడమే కాకుండా అవసరమైన పత్రాలను సమర్పించడంలో విఫలమవ్వడంతోనే జరిమాన విధించినట్లు స్పష్టం చేశారు.

అందువల్ల ట్రంప్‌ మంగళవారం నుంచే రోజువారి జరిమాన చెల్లించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఉద్దేశపూర్వకంగానే కోర్టు ఆదేశాలను దిక్కరించినట్లు తెలిపారు. గోల్ఫ్ క్లబ్‌లు, పెంట్‌హౌస్ అపార్ట్‌మెంట్‌తో సహా ఆస్తుల విలువలను దర్యాప్తులో తప్పుగా పేర్కొన్నట్లు ఆధారాలు ఉన్నాయన్నారు. అంతేకాదు కొన్ని సందర్భాల్లో ఆస్తులుపై మంచి రుణాలు పొందడం కోసం వాటి విలువను అధికంగా చూపించారని, మరికొన్ని సందర్భాల్లో పన్ను ప్రయోజనాలను పొందడం కోసం వాటి విలువనే తక్కువగా కూడా చూపించారని పేర్కొన్నారు.

వాస్తవానికి ట్రంప్‌ గతంలోనే కోర్టు ఆదేశాల మేరకు ఆ ఆస్తులకు సంబంధించిన పత్రాలు సమర్పించడంలో విఫలమయ్యారు. కానీ ఆయన తరుపున న్యాయవాదులు అభ్యర్థన మేరకు కోర్టు మార్చి 31 వరకు గడువు ఇచ్చింది. అయితే ట్రంప్‌ తరుపు న్యాయవాది అలీనా హబ్బా విచారణ అనంతరం ఈ విషయమై అప్పీలు చేస్తానని చెప్పాడం గమనార్హం.  

(చదవండి: పుతిన్‌కు నా తడాఖా చూపించేవాడిని.. ట్రంప్‌ సంచలన వ్యాఖ్యలు!)
 

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top