Trending Top 10 News: టుడే ట్రెండింగ్‌ & టాప్‌ 10 న్యూస్‌

Top 10 Telugu Latest Current News Evening Headlines Today 19th April 2022 5PM - Sakshi

ఆయుధాలు వీడండి.. ఉక్రెయిన్‌ దళాలకు రష్యా స్ట్రెయిట్‌ వార్నింగ్‌
ఉక్రెయిన్‌ దళాలకు రష్యా హెచ్చరికలు జారీ చేసింది. భారత కాలమానం ప్రకారం.. మంగళవారం మధ్యాహ్నాం ‘‘ఆయుధాల్ని పక్కనపెట్టాలని ఉక్రెయిన్‌ బలగాలను రష్యా హెచ్చరించినట్లు..

మత ఘర్షణల నేపథ్యంలో.. యోగి సర్కార్‌ కీలక నిర్ణయం
మత హింసకు సంబంధించిన ఘటనలు పలు రాష్ట్రాల్లో నమోదు అవుతున్న నేపథ్యంలో.. ఉత్తర ప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్‌ అప్రమత్తం అయ్యారు.

 

కాబుల్‌లో బాంబు పేలుడు.. ఆరుగురి మృతి
ఆఫ్ఘనిస్తాన్‌ రాజధాని కాబుల్‌లో బాంబు పేలుడు చోటు చేసుకుంది. పశ్చిమ కాబూల్‌లోని ఓ పాఠశాలలో బాంబు పేలుడు జరిగిన ఘటనలో ఆరుగురు మృతి చెందగా, 11 మంది గాయపడినట్లు ఆఫ్ఘన్ పోలీసు అధికారులు వెల్లడించారు.

నాకు ఎవరితోనూ భేదాభిప్రాయాలు లేవు: కాకాణి
పార్టీలోని నేతలందరం కలిసిమెలిసి పనిచేస్తున్నామని వ్యవసాయ, సహకార, మార్కెటింగ్‌, ఫుడ్‌ ప్రాసెసింగ్‌ శాఖ మంత్రి కాకాణి గోర్థన్‌రెడ్డి తెలిపారు. 

హర్యానా ముఖ్యమంత్రితో సీఎం జగన్‌ మర్యాదపూర్వక భేటీ
హర్యానా ముఖ్యమంత్రి మనోహర్‌లాల్‌ ఖట్టర్‌తో ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి భేటీ అయ్యారు. రుషికొండ పెమ వెల్‌నెస్‌ రిసార్ట్‌లో హర్యానా ముఖ్యమంత్రి మనోహర్‌లాల్‌ ఖట్టర్‌తో సీఎం జగన్‌ మర్యాద పూర్వకంగా సమావేశమయ్యారు.

వరి ధాన్యం కొనుగోలు వ్యవహారం.. కేసీఆర్ వ్యూహాలు ఫలించాయా?
తెలంగాణలో వరి ధాన్యం కొనుగోలు వ్యవహారం ఒక కొలిక్కి వచ్చినట్లేనా?  ముఖ్యమంత్రి కేసీఆర్ తామే వడ్లు కొనుగోలు చేస్తామని ప్రకటించడంతో రైతులలో ఉన్న ఆందోళన తగ్గిందని చెప్పాలి.

ఆచార్య రీషూట్‌పై స్పందించిన కొరటాల శివ
మెగాస్టార్‌ చిరంజీవి, ఆయన తనయుడు రామ్‌చరణ్‌ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ఆచార్య. కొరటాల శివ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఎన్నో వాయిదా అనంతరం ఏప్రిల్‌ 29న విడుదలకు సిద్దమైంది.

ఢిల్లీ క్యాపిటల్స్‌, పంజాబ్‌ కింగ్స్‌ మ్యాచ్‌ వేదిక మార్పు
ఢిల్లీ క్యాపిటల్స్‌ క్యాంప్‌లో కరోనా కేసులు వెలుగుచూసిన నేపథ్యంలో రేపు (ఏప్రిల్‌ 20) పంజాబ్‌ కింగ్స్‌తో జరుగబోయే మ్యాచ్‌కు సంబంధించి కీలక అప్‌డేట్‌ వెలువడింది.

అదిగో అదిరిపోయే ఆడి కారు
లగ్జరీ కార్ల తయారీ సంస్థ ఆడి త్వరలో ఏ8 సెడాన్‌ కొత్త వెర్షన్‌ను విడుదల చేస్తోంది. లాంగ్‌ వీల్‌ బేస్, 3 లీటర్‌ పెట్రోల్‌ ఇంజన్‌తో రూపుదిద్దుకుంది. పూర్తిగా తయారైన కారును భారత్‌కు దిగుమతి చేస్తారు.

సైనికుడిని కాపాడిన ఫోన్‌.. ఎలాగో తెలుసా..?
ఉక్రెయిన్‌లో రష్యా బలగాల దాడులు కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఒక ఉక్రెయిన్‌ సైనికుడు మాత్రం మొబైల్‌ ఫోన్‌ కారణంగా బతికి బయటపడ్డాడు.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top