Smartphone Saved Ukrainian Soldier Life By Stopping Bullet, Video Viral On Social Media - Sakshi
Sakshi News home page

Russia War: ఉక్రెయిన్‌ సైనికుడిని కాపాడిన ఫోన్‌.. ఎలాగో తెలుసా..?

Apr 19 2022 1:28 PM | Updated on Apr 19 2022 1:38 PM

Smart Phone Saved Ukrainian Soldier Life By Stopping Bullet - Sakshi

​కీవ్‌: ఉక్రెయిన్‌లో రష్యా బలగాల దాడులు కొనసాగుతున్న విషయం తెలిసిందే. రష్యా సేనల బాంబు దాడుల్లో ఉక్రెయిన్‌లో భారీగా ప్రాణ నష్టం చోటుచేసుకుంది. అటు ఉక్రెయిన్‌ సైన్యంతో పాటుగా రష్యా సైనికులు కూడా వేల సంఖ్యలో మృతి చెందారు. 

ఇదిలా ఉండగా.. యుద్ధం ప్రారంభమై దాదాపు రెండు నెలలు కావస్తోంది. ఇక, యుద్ధంలో ఓ ఉక్రెయిన్ సైనికుడి వైపు బుల్లెట్ దూసుకొచ్చింది. ఆ బుల్లెట్‌ నుంచి ఓ స్మార్ట్‌ ఫోన్‌ ఉక్రెయిన్‌ వీరుడి ప్రాణాలను కాపాడింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. ఈ వీడియోలో గడ్డకట్టే చలిలో ఇద్దరు ఉక్రెయిన్‌ సైనికులు మాట్లాడుకుంటున్నారు. ఓ సైనికుడు.. తన షర్ట్ పాకెట్‌లో స్మార్ట్ మొబైల్ ఉంచుకొని... యుద్ధం చేస్తున్నాడు. ఇంతలో ఎటు నుంచి వచ్చిందో తెలియదు. ఓ బుల్లెట్ తన వైపు దూసుకొచ్చింది. అతనికి తెలియకుండానే అది అతని మొబైల్‌కి గుచ్చుకొని అక్కడ ఆగిపోయింది. 

బుల్లెట్‌ కరెక్ట్‌గా ఫోన్‌లో ఇరుక్కుపోయింది. ఒకవేళ ఆ ఫోన్‌ కనుక అక్కడ పాకెట్‌లో లేకపోతే సదరు సైనికుడు బుల్లెట్‌ తగిని చనిపోయే పరిస్థితి ఎదురయ్యేది. అలా ఆ మొబైల్‌ ఫోన్‌ సైనికుడి ప్రాణాలను కాపాడింది. 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement