TikTok Star Jiya Khan Expresses Desire To Marry Former Pakistan PM - Sakshi
Sakshi News home page

ఆయనకు ‘కొంటె’ భార్య కావాలి.. ఇమ్రాన్‌ఖాన్‌కు నాలుగో భార్యనవుతా..

May 30 2023 8:37 PM | Updated on May 30 2023 9:09 PM

Tiktok Star Jia Khan Expresses Desire To Marry Former Pakistan Pm - Sakshi

పాకిస్థాన్‌ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ను పెళ్లి చేసుకోవాలని ఉందంటూ యూకేకు చెందిన ఓ టిక్‌ టాక్‌ స్టార్‌ ప్రపోజ్‌ చేయడం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఆయనకు నాలుగో భార్యనవుతానని చెప్పిన ఓ వీడియో హల్‌చల్‌ చేస్తోంది.

పాకిస్థాన్‌ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ను పెళ్లి చేసుకోవాలని ఉందంటూ యూకేకు చెందిన ఓ టిక్‌ టాక్‌ స్టార్‌ ప్రపోజ్‌ చేయడం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఆయనకు నాలుగో భార్యనవుతానని చెప్పిన ఓ వీడియో హల్‌చల్‌ చేస్తోంది. అవిశ్వాస పరీక్షలో ఓడిపోయి పదవి నుంచి వైదొలిగిన నాటి నుంచి ఇమ్రాన్‌ ఖాన్‌ రాజకీయంగా ఇబ్బందులు పడుతున్న విషయం తెలిసిందే.. ఇలాంటి సమయంలో యూకేకు చెందిన జియా ఖాన్‌ అనే టిక్‌టాకర్‌ ఈ ప్రతిపాదన చేసింది.

‘‘ఆయన ముందు జెమీమాను వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత అందమైన ఓ జర్నలిస్టు ఆయనకు రెండో భార్యగా వచ్చింది. మూడోసారి ఓ సంప్రదాయబద్ధమైన మహిళను వివాహమాడారు. ఇప్పుడు ఆయన జీవితంలో గ్లామర్‌ నింపాల్సిన అవసరం ఉంది. ఆయనకో కొంటె భార్య కావాలి. నేను ఆయనను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నా. నాలుగో భార్యగా ఉండాలనుకుంటున్నా.

ఇందుకోసం బుష్రా బీబీతో బంధాన్ని తెంచడానికైనా నేను సిద్ధమే. ఆయన వయసు 70 ఏళ్లు. అయినా నాకేం ఇబ్బంది లేదు. ఎందుకంటే ఆయన ఇమ్రాన్‌ ఖాన్‌ ’’ అంటూ ఆ వీడియోలో  జియా ఖాన్‌  కొంటెగా  చెప్పింది. ఇమ్రాన్‌ ఖాన్‌ రాజకీయంగా కేసులు, అరెస్టులతో ఆయన ఇబ్బందులు పడుతున్నారు. ఇలాంటి సమయంలో ఆయనకు కొత్త అభిమాని లభించారంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.
చదవండి: అందాల పోటీల్లో భార్య ఓటమి.. కోపంతో భర్త ఏం చేశాడంటే..

Advertisement
 
Advertisement
Advertisement