నిజ్జర్‌ హత్య కేసులో ముగ్గురు అరెస్ట్‌ | Three Indians Arrested In Khalistani Separatist Hardeep Singh Nijjar Murder case | Sakshi
Sakshi News home page

నిజ్జర్‌ హత్య కేసులో ముగ్గురు అరెస్ట్‌

May 5 2024 5:39 AM | Updated on May 5 2024 5:39 AM

Three Indians Arrested In Khalistani Separatist Hardeep Singh Nijjar Murder case

మరిన్ని అరెస్టులుంటాయన్న కెనడా పోలీసులు

ఒట్టావా: ఖలిస్తానీ వేర్పాటువాది హర్దీప్‌  నిజ్జర్‌ హత్య కేసులో ముగ్గురిని అరెస్ట్‌ చేసినట్లు కెనడా పోలీసులు తెలిపారు.  మరిన్ని అరెస్టులుంటాయని స్పష్టం చేశారు. ఎడ్మంటన్‌లో ఉంటున్న భారత పౌరులు కరణ్‌ బ్రార్‌(22), కమల్‌ప్రీత్‌ సింగ్‌(22), కరణ్‌ప్రీత్‌ సింగ్‌(28)లపై హత్య, హత్యకు కుట్ర కేసులు నమోదు చేశామన్నారు. 

కెనడా పౌరుడైన నిజ్జర్‌ హత్యలో భారత ప్రభుత్వ ప్రమేయం కోణంలోనూ విచారణ సాగుతోందని రాయల్‌ కెనడియన్‌ మౌంటెడ్‌ పోలీస్‌ (ఆర్‌సీఎంపీ) విభాగం శుక్రవారం తెలిపింది. 2023 జూన్‌ 18వ తేదీన బ్రిటిష్‌ కొలంబియా ప్రావిన్స్‌ సర్రేలోని గురుద్వారా వెలుపల ఉన్న నిజ్జర్‌ను గుర్తు తెలియని దండగులు కాల్చి చంపారు. భారత ప్రభుత్వం హస్తం ఉందంటూ కెనడా ప్రధాని ట్రూడో చేసిన తీవ్ర ఆరోపణలతో రెండు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్న విషయం తెలిసిందే.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement