థాయ్‌లాండ్‌లో మాయలేడి | Thailand woman seduced extorted senior monks for millions, arrested | Sakshi
Sakshi News home page

థాయ్‌లాండ్‌లో మాయలేడి

Jul 20 2025 5:43 AM | Updated on Jul 20 2025 5:43 AM

Thailand woman seduced extorted senior monks for millions, arrested

బౌద్ధ గురువులు, సన్యాసులతో శృంగారం 

బ్లాక్‌మెయిల్‌ చేసి రూ.102 కోట్లు వసూలు 

బ్యాంకాక్‌: అందం ఎరవేసి బౌద్ధ గురువులు, సన్యాసులను ఉచ్చులోకి లాగి, రూ.100 కోట్లకుపైగా వసూలు చేసిన మాయలేడి వ్యవహారం థాయ్‌లాండ్‌లో సంచలనం సృష్టిస్తోంది. గత నెలలో బ్యాంకాక్‌లోని బౌద్ధ ఆలయం నుంచి ఫ్రా థెప్‌ అనే సీనియర్‌ గురువు అదృశ్యమయ్యాడు. ఈ ఘటనపై విచారణ చేపట్టిన పోలీసులకు నివ్వెరపోయే నిజాలు తెలిశాయి. అతడి అదృశ్యం వెనుక ‘మిస్‌ గోల్ఫ్‌’ అనే మహిళ ప్రమేయం ఉన్నట్లు వెల్లడయ్యింది. 

ఆమె ఇంట్లో సోదాలు చేయగా, 80 వేలకుపైగా సెక్స్‌ ఫొటోలు, వీడియోలు ఉన్న ఫోన్లు లభించాయి. ఆమె అసలు పేరు విలావన్‌ ఎమ్సావత్‌ అని గుర్తించారు. వయసు 30 ఏళ్లు. బౌద్ధ సన్యాసులకు వలవేసి, ఏకాంతంగా ఉన్నప్పుడు వారికి తెలియకుండా ఫొటోలు, వీడియోలు చిత్రీకరించడం, వాటిని చూపించి బ్లాక్‌మెయిల్‌ చేసి, భారీగా డబ్బులు వసూలు చేయడం ఆమె దినచర్య అని పోలీసుల విచారణలో వెల్లడయ్యింది. 

బెదిరింపులు, బలవంతపు వసూళ్లు, మనీ లాండరింగ్‌ కేసులో ఎమ్సావత్‌ను పోలీసులు అరెస్టు చేశారు. చాలామంది బౌద్ధ గురువులు, సన్యాసులు ఆమె వలలో చిక్కినట్లు గుర్తించారు. గత మూడేళ్లలో వారి నుంచి 385 బాత్స్‌ (రూ.102 కోట్లు) వసూలు చేసింది. అదృశ్యమైన ఫ్రా థెప్‌ ఆచూకీ ఇంకా లభించలేదు. అతడితో ఎమ్సావత్‌కు 2024 మే నెలలో సంబంధం ఏర్పడింది. అతడితో తాను బిడ్డను కన్నట్లు చెబుతోంది. 

బిడ్డ సంరక్షణ కోసం ఫ్రా థెప్‌ నుంచి తనకు రూ.1.90 కోట్లు ఇప్పించాలని డిమాండ్‌ చేస్తోంది. ఎమ్సావత్‌ బౌద్ధ సన్యాసుల నుంచి డబ్బులతోపాటు ఖరీదైన వస్తువులు, వాహనాలు కూడా స్వీకరించింది. అయితే, ఆ సొమ్మును ఆన్‌లైన్‌ జాదంలో పెట్టింది. బౌద్ధ ఆలయాలకు భక్తుల నుంచి విరాళంగా వచ్చిన డబ్బును సన్యాపులు ఈ మాయలేడికి ధారపోసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ వ్యవహారంపై విచారణ జరపాలని ప్రభుత్వం ఆదేశించింది. భగవంతుడి సన్నిధిలో ఉంటూ ఆదర్శవంతమైన జీవితం గడపాల్సిన బౌద్ధ సన్యాసులు శారీరక సుఖాల కోసం ఆరాటపడడం పట్ల జనం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement