ఎయిర్‌పోర్ట్‌లో యాపిల్‌ జ్యూస్‌ వివాదం..యువతి అరెస్టు

Teenage Girl Arrested Aftef  Arkansas Airport Staff Over Apple Juice - Sakshi

యూపిల్‌ జ్యూస్‌ని ఎయిర్‌పోర్ట్‌లో అనుమతించ లేదని టీనేజ్‌ గర్ల్‌ శివాలెత్తిపోయింది. కోపంతో ఊగిపోయి అధికారులపై దాడి చేసింది. ఈ షాకింగ్‌ ఘటన యూఎస్‌లో అర్కాన్సాస్‌లోని ఫినిక్స్‌ ఎయిర్‌పోర్ట్‌లో చోటు చేసుకుంది. మంగళవారం ఉదయం ఫినిక్స్ స్కై హార్బర్‌ అంతర్జాతీయ విమానాశ్రయం సెక్యూరిటీ గుండా 19 ఏళ్ల మకియా కోల్‌మాన్‌  వెళ్తోంది. ఐతే ఆమె పెద్ద మొత్తంలో ఆపిల్‌ జ్యూస్‌ని తీసుకుని వెళ్తోంది.

అంత మొత్తంలో జ్యూస్‌ని తీసుకువళ్లేందుకు అనుమతి లేదని ఎయిర్‌పోర్ట్‌ అధికారులు ఆమెకు చెప్పారు. ఈ మేరకు అధికారులు ఆ జ్యూస్‌ని ఆమె నుంచి స్వాధీనం చేసుకునేందుకు యత్నిస్తుండగా.. ఆమె తిట్టడం ప్రారంభించింది. వారిలో ఒక అధికారి ఆమెను పక్కకు నెట్టడంతో ఆమె సీరియస్‌ అయ్యి అధికారులతో గొడవకు దిగింది. ఒక అధికారి చేయి కొరికి, మోచేతులతో కొట్టడం, ఒక అధికారి జుట్టుని పట్టుకుని దాడి చేయడం వంటివి ప్రారంభించింది.

ఈ అనూహ్య ఘటనతో సంఘటన స్థలానికి చేరుకున్న ఫీనిక్స్‌ పోలీసులు సదరు యువతి కోల్‌మాన్‌ని అదుపులోకి తీసుకున్నారు. ఆమె దాడి కారణంగా ఇద్దరు అధికారులు ఆస్పత్రి పాలయ్యారు. ఆ యువతి వీరంగంతో చెక్‌పాయింట్‌ని మూసివేసి.. భద్రతా స్క్రీనింగ్‌ కోసం సుమారు 450 మంది ప్రయాణికులు మరో చెక్‌పాయింట్‌కి వెళ్లాల్సి వచ్చింది. 

(చదవండి: బ్యూటీపార్లర్‌కు వెళ్లనివ్వలేదని భార్య క్షణికావేశంతో..)

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top