Japan Licable Tv Screen: గమ్మత్తైన టీవి.. చూస్తే నోరూరుతుంది.. నాకితే రుచి తెలుస్తుంది.. ఎక్కడో తెలుసా!

Tasty Tv: Japan Company Invents Flavourful Tv Screen Gives Taste - Sakshi

కొంతమందికి కొన్ని ఆహార పదార్థాలను తలచుకోగానే నోరు ఊరుతుంది. కళ్లముందు కనపడితే.. అసలు ఆగలేరు. ఇలాంటి వారినే ఊరిస్తూ ఉంటాయి.. టీవీలో కనిపించే  కొన్ని ఆహారపదార్థాలకు సంబంధించిన ప్రకటనలు, ఫుడ్‌  షోలు. ఆ ఆహార పదార్థాలను ఎంచక్కా రుచి చూడొచ్చు  కాణి ఖర్చు లేకుండా. నిజం.. జపాన్‌లో టీటీటీవీ అంటే ‘టేస్ట్‌ ద టీవీ’ పేరుతో ఒక డివైజ్‌ను రూపొందించారు. ఇందులోని ప్రొటోటైప్‌ తెరకు ప్రత్యేకమైన సెటప్‌ ద్వారా కొన్ని టేస్టీ ట్యూబ్‌లను అమర్చారు.

దీంతో  తెరపై కనిపించే ఆహార పదార్థాలను నాకి, రుచి చూడొచ్చు. అంతేకాదు మీకు నచ్చిన  ఫ్లేవర్స్‌నూ కోరి మరీ టేస్ట్‌ చేయొచ్చు.  ఉదాహరణకు చాక్లెట్‌ ఫ్లేవర్‌ అని చెబితే.. వెంటనే, తెర మీద ఉన్న ఫ్లాస్టిక్‌ షీట్‌పై ఆ ఫ్లేవర్‌ బొమ్మ వచ్చి పడుతుంది. చక్కగా ఆ చాక్లెట్‌ను చప్పరించొచ్చు. ప్రస్తుతం జపాన్‌కు చెందిన ప్రసిద్ధమైన పది వంటకాల రుచులను మాత్రమే తెలియజేస్తుందీ టీవీ. త్వరలోనే మరింత అ‹ప్‌డేట్‌ అయ్యి అన్ని రుచులనూ  ఆస్వాదించేలా ఆ టీవీని రూపొందిస్తామని చెప్తోంది సదరు టీవీ కంపెనీ యాజమాన్యం. 
  

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top