మొదలైన తాలిబన్ల అరాచకం: ఇంటింటికెళ్లి నగదు లూటీ

Talibans Getting Details Of Govt Employees And Journalists - Sakshi

కాబూల్‌: ఆఫ్గానిస్తాన్‌లో ఊహించిన పరిణామాలే జరుగుతున్నాయి. ప్రపంచదేశాలతో పాటు సొంత దేశస్తులు భయపడినట్టే తాలిబన్లు రెచ్చిపోతున్నారు. వారి అరాచకం తీవ్ర రూపం దాల్చుతోంది. ఎలాంటి దాడులు చేయమని అఫ్గాన్‌ను చేజిక్కుంటున్న సమయంలో చేసిన హామీని తాలిబన్లు ఉల్లంఘిస్తున్నారు. దీంతో ఇప్పుడు కాబూల్‌లో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. 

కాబూల్‌లో ఇంటింటిని గాలిస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగులు, జర్నలిస్టులు, భద్రతా సిబ్బంది వివరాలు సేకరించారు. ఇంకా ఇళ్లలోకి ప్రవేశించి నగదు లూటీ చేస్తున్నాడు. అడ్డు వచ్చిన వారిపై తీవ్రంగా దాడులు చేస్తూ హల్‌చల్‌ చేస్తున్నారు. ఇక  జైళ్లలో బందీగా ఉన్న తమ మద్దతుదారులను విడుదల చేస్తున్నారు. ఈ అరాచక దృశ్యాలు సోషల్ మీడియాలో తాలిబన్లు పోస్టు చేస్తూ వికృత ఆనందం పొందుతున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో తమ రాయబార కార్యాలయాన్ని అమెరికా పూర్తిగా మూసివేసింది. అఫ్గాన్‌ పరిణామాలు ప్రపంచ దేశాలను ఆందోళన కలిగిస్తున్నాయి. ఐక్యరాజ్య సమితి వెంటనే చొరవ తీసుకోవాలని చాలా దేశాలు విజ్ఞప్తి చేస్తున్నాయి.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top