ఆ మహిళలకు విమానంలోకి నో ఎంట్రీ

Taliban Blocks Women From Boarding Flights Alone - Sakshi

ఇస్లామాబాద్‌: అఫ్గానిస్తాన్‌లో మహిళలపై అణచివేత నానాటికీ పెరుగుతోంది. మగ తోడు లేకుండా వారు ఒంటరిగా విమానాల్లో ప్రయాణించడానికి వీల్లేదని తాలిబన్లు తాజాగా హుకుం జారీ చేశారు. శుక్రవారం కాబూల్‌ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్టులో ఒంటరి మహిళలను విమానమెక్కేందుకు అనుమతించలేదు. బాలికలు ఆరో తరగతి వరకే చదువుకోవాలన్న ఆదేశాలను నిరసిస్తూ రాజధాని కాబూల్‌లో బాలికలు శనివారం భారీ ప్రదర్శన నిర్వహించారు. 

చదవండి: (మాట తప్పిన తాలిబన్లు.. షాకింగ్‌ నిర్ణయంతో ఆవేదనలో బాలికలు)

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top