శ్రీలంకలో కరెంట్‌ చార్జీల మోత.. ఐఎంఎఫ్‌ ఒత్తిడికి తలొగ్గి నిర్ణయం..

Sri Lanka Power Charges Increased 24 Hours Current Supply - Sakshi

కొలంబో: అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ(ఐఎంఎఫ్‌) నిబంధనలు శ్రీలంక ప్రజల పాలిట పెనుభారంగా మారుతున్నాయి. ఐఎంఎఫ్‌ విధించిన నిబంధనలకు తలొగ్గిన శ్రీలంక ప్రభుత్వం విద్యుత్‌ చార్జీలను 66 శాతం పెంచేస్తూ నిర్ణయం తీసుకుంది. కరెంటు చార్జీలు పెంచడం గత ఆరు నెలల్లో ఇది రెండోసారి.  బిల్లుల పెంపు నేపథ్యంలో విద్యుత్‌ కోతలకు గురువారం నుంచే తెరపడింది.

ఇకపై నిరంతరాయంగా కరెంటు సరఫరా చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. శ్రీలంకలో గత ఏడాది కాలంగా కరెంటు కోతలు కొనసాగాయి. నిత్యం ఒక గంట నుంచి 14 గంటలదాకా కరెంటు సరఫరా నిలిపివేశారు. రుణం ఇవ్వాలంటే విద్యుత్‌ చార్జీలు పెంచాలని ఐఎంఎఫ్‌ స్పష్టం చేయడంతో శ్రీలంక ప్రభుత్వం ఒప్పుకోక తప్పలేదు. ఐఎంఎఫ్‌ నుంచి 2.9 బిలియన్‌ డాలర్ల రుణం తీసుకోనుంది.
చదవండి: ఉక్రెయిన్‌పై మరోసారి క్షిపణలు వర్షం..

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top