అనేక రంగుల్లో ఉన్న ఆకును ఎప్పుడైనా చూశారా..

Small World Competition: Multi Colour Leaf Plant - Sakshi

న్యూయార్క్‌: ఆకులు ఏ రంగులో ఉంటాయో తెలుసా? అంటే.. ఇదేం ప్రశ్న.. ఆకుపచ్చ రంగులోనే కదా అంటారా.. మనకు కనబడేది ఆకుపచ్చ రంగులోనే. కానీ దాన్ని దగ్గరగా జూమ్‌ చేసి చూస్తే.. చాలా రంగులు కనిపిస్తాయి. ఇదిగో.. ఈ ఫొటోనే దీనికి ఎగ్జాంపుల్‌. ఇందులో వివిధ రంగుల్లో మెరిసిపోతున్నది ఆలివ్‌ చెట్టు ఆకు. అమెరికాలోని బేలోర్‌ కాలేజ్‌ ఆఫ్‌ మెడిసిన్‌ శాస్త్రవేత్త జేసన్‌ కిర్క్‌ మైక్రోస్కోప్‌తో ఈ ఫొటో తీశారు. ఇందులో తెల్లగా పైకి పొడుచుకు వచ్చిన భాగాలను ట్రైకోమ్స్‌ అంటారు.

ఆకులపై ఒత్తిడి పడినప్పుడు అవి షాక్‌ అబ్జార్వర్లలా పనిచేసి రక్షిస్తాయి. వంకాయ రంగులో ఉన్నవేమో ఆకులు కార్బన్‌డయాక్సైడ్, ఆక్సిజన్‌లను పీల్చి వదిలేసే రంధ్రాలు (స్టొమాటా). ఆకుల్లో నీళ్లు, ఇతర పోషకాలను రవాణా చేసే నాళాలు నీలం రంగులో కనిపిస్తున్నాయి. ప్రఖ్యాత కెమెరా తయారీ సంస్థ నికాన్‌ నిర్వహించే ‘స్మాల్‌ వరల్డ్‌ కాంపిటీషన్‌’లో ఈ ఫొటో మొదటి బహుమతికి ఎంపికైంది.   

చదవండి: ముళ్లపందితో పోరులో పులి మృతి 

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top