Inspirational Story: 26 ఏళ్ల కొడుకును వీపుపై మోస్తూ ప్రపంచ పర్యటన చేస్తున్న తల్లి!

Single Mother Carries Her Disabled Son On Her Back For World Tour - Sakshi

దేవుడు అన్ని చోట్ల ఉండలేక అమ్మను సృష్టించాడు అనే నానుడికి మరో ఉదాహరణ ఆమె కథ. వికలాంగుడైన బిడ్డను ఇతర తల్లుల్లా చెత్త కుప్పల్లో పడేయడానికి ఆమె మాతృ హృదయం వెనుకాడింది. అమ్మకు బిడ్డ ఎప్పటికీ బరువు కాదుగా! అందుకే కడుపున మోసిన బిడ్డను ఈ సారి వీపున మోసింది. ప్రపంచం అంచులా దాకా తీసుకెళ్లింది. కళ్లు కనిపించని బిడ్డకు తన కళ్లతో లోకమంతా చూపిస్తోంది. ఇప్పుడు సోషల్‌ మీడియాలో ఈ తల్లీబిడ్డలకు చెందిన ఫొటోలు టాక్‌ ఆఫ్‌ ది టౌన్‌గా మారాయి. వీటిని చూస్తే మీరు ఖచ్చితంగా భావోధ్వేగానికి గురౌతారు.

ఆస్ట్రేలియాలోని క్వీన్స్‌లాండ్‌ సన్‌షైన్‌ కోస్ట్‌కు చెందిన నిక్కి ఆంత్రమ్‌ (43)కు 17 ఏళ్ల వయసులో మగ బిడ్డ పుట్టాడు. ఐతే పుట్టిన బిడ్డకు అంగవైకల్యంతోపాటు, కళ్లు కూడా కనిపించవని తెలుసుకుని కుమిలిపోయింది. ఐతేనేమి తన కళ్లతో బిడ్డకు లోకాన్ని చూపాలనుకుంది. 24 గంటలు కొడకు జిమ్మీ వెన్నంటే ఉండి ఏ కష్టం తెలియకుండా పెంచసాగింది. ఇప్పుడు జిమ్మీకి 26 ఏళ్లు. ఐతే ప్రపంచ పర్యటన (వరల్డ్‌ టూర్‌)కు వెళ్లాలనుకున్న నిక్కి తన కొడుకును కూడా తనతోపాటే తీసుకెళ్లాలనుకుంది. వీపుపై జిమ్మీని మోస్తూ హవాయి నుంచి బాలి వరకు అనేక ప్రదేశాలకు కొడుకును తీసుకెళ్తోంది.

మామూలు పిల్లలకు అందినట్టే నా కొడుకుకు కూడా సకల ఆనందాలను పంచాలనుకుంటున్నాను. నా కోడుకు జిమ్మీతో కరోనా వ్యాప్తికి ముందే కెనడాను సందర్శించానలనుకున్నాను. డైపర్లు, బట్టలు, బెడ్‌ ప్యాడ్స్‌, దుప్పట్లు, దిండులు మాతో పాటు తీసుకెళ్తున్నాను. వీపుపై జిమ్మీని మోయడం ప్రాక్టీస్‌ చేశాను కూడా. ఇక మరిన్ని ప్రదేశాలను మేమిద్దరం సందర్శిస్తామని నిక్కీ చెబుతోంది.

నిక్కీ - జిమ్మీల కథ ఎందరికో ఆదర్శం.

చదవండి: నోట్లో గుడ్డలు కుక్కి.. పీక నులిమి హత్య! ఏం ఎరగనట్టు నాటకం..

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top