త్వరలో రష్యా ప్రజలకు కరోనా టీకా

Russia starts public distribution of COVID-19 vaccine - Sakshi

మాస్కో:  కరోనా వైరస్‌ను నిరోధించే ‘స్పుత్నిక్‌ –వీ’ టీకా త్వరలో మాస్కోలో ప్రజా పంపిణీకి సిద్ధమవుతోందని రష్యా అధికార మీడియా గురువారం వెల్లడించింది. అయితే, పూర్తిస్థాయిలో భద్రత, సామర్థ్య పరీక్షలు జరపకుండానే ఈ టీకాను మార్కెట్లోకి తీసుకురావాలన్న ప్రయత్నాలపై ప్రపంచవ్యాప్తంగా విమర్శలు కూడా వచ్చాయి. స్పుత్నిక్‌–వీ టీకాలు ప్రజాపంపిణీ కోసం పెద్ద ఎత్తున ఉత్పత్తి అవుతున్నాయని గతవారమే రష్యా ఆరోగ్య శాఖ ప్రకటించింది. త్వరలోనే దేశంలోని అన్ని ప్రాంతాలకు వాటిని పంపించనున్నామని పేర్కొంది.

‘గమాలెయ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఎపిడెమాలజీ అండ్‌  మైక్రోబయాలజీ’ రూపొందించిన ఈ టీకా అవసరమైన అన్ని నాణ్యత పరీక్షల్లో విజయవంతమైందని స్పష్టం చేసింది. పూర్తిస్థాయి మానవులపై పూర్తిస్థాయిలో ప్రయోగాలు ముగియకముందే, వినియోగానికి ప్రభుత్వ అనుమతి పొందిన తొలి టీకాగా స్పుత్నిక్‌–వీ నిలిచింది. అనుమతి పొందిన తరువాత అడ్వాన్స్‌డ్‌ ట్రయల్స్‌ను కొనసాగించారు. సుమారు 40 వేల మందిపై జరుగుతున్న ఫేజ్‌ 3 ప్రయోగ ఫలితాలు అక్టోబర్, నవంబర్‌ల్లో వెలువడే అవకాశముంది.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top