
ఉక్రెయిన్‌పై రష్యా బలగాల దాడులు 12 రోజూ కొనసాగుతున్నాయి. ఇప్పటి వరకు రెండు సార్లు కాల్పులకు విరామం ప్రకటించినప్పటికీ ప్రధాన నగరాలను టార్గెట్ చేస్తూ రష్యా దళాలు బాంబులు వర్షం కురిపిస్తూ ముందుకు సాగుతున్నాయి. ఇటు రష్యా సేనల దాడులను ఉక్రెయిన్ సైతం తీవ్రంగా ప్రతిఘటిస్తోంది. శుత్రు బలగాల నుంచి దేశాన్ని రక్షించుకునేందుకు విరోచితంగా పోరాడుతోంది. ఈ క్రమంలో రష్యా కీలక ప్రకటన చేసింది. ఉక్రెయిన్ తమ షరతులను అంగీకరిస్తే సైనిక చర్యను నిలిపివేయడానికి సిద్ధంగా ఉన్నట్లు రష్యా వెల్లడించింది.
చదవండి: Ukraine Crisis: ప్రధాని మోదీకి థ్యాంక్స్ చెప్పిన జెలెన్‌స్కీ.. ఎందుకంటే
ఈ మేరకు రష్యా అధ్యక్షుడి ప్రెస్ సెక్రటరీ దిమిత్రి పెస్కోవ్ మీడియాతో మాట్లాడుతూ.. ఉక్రెయిన్ తమ షరతులను ఒప్పుకున్నట్లైతే తక్షణమే సైనిక చర్యను నిలిపివేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పారు. దీనికి ఉక్రెయిన్ ఏ కూటమిలోనూ చేరకుండా ఉండేందుకు తమ రాజ్యాంగాన్నిసవరణలు చేయాలని తెలిపారు. ఇదిలా ఉండగా ఉక్రెయిన్- రష్యా మధ్య మూడో విడత శాంతి చర్చలు సోమవారం సాయంత్రం 7.30 గంటలకు జరగనున్నట్లు ఉక్రెయిన్ అధ్యక్షుడి సలహాదారు ప్రకటించారు.
చదవండి: రష్యాతో స్నేహం ధృడంగా ఉంది.. అందుకు సిద్ధంగా ఉన్నాం: చైనా
మరోవైపు రష్యాకు చెందిన ఇద్దరు ఉన్నతస్థాయి మిలిటరీ కమాండర్లు యుద్ధంలో మృతిచెందినట్లు ఉక్రెయిన్ ఆర్మీ ప్రకటించింది. అదే విధంగా రష్యా బలగాలు ఉక్రెయిన్ రాజధాని కైవ్‌కు సమీపంలోని గోస్టోమెల్ మేయర్‌ను కాల్చి చంపినట్లు సోమవారం స్థానిక అధికారులు తెలిపారు. ఆకలితో ఉన్నవారికి ఆహారాన్ని, రోగులకు మందులు పంపిణీ చేస్తున్న సమయంలో ఆయనతోపాటు మరో ఇద్దరిని కాల్చిచంపారని పేర్కొన్నారు. ఆయన తన ప్రజల కోసం, గోస్టోమెల్ కోసం హీరోగా ప్రాణాలు విడిచాడని తెలిపారు.