
టోక్యో: ఆరోగ్యంగా ఉండేందుకు కూరగాయలతో పాటు పండ్లు తినాలి. అయితే పండ్లు కేవలం అనారోగ్యం వచ్చినప్పుడే తినాలనే అపవాదుతో ప్రజలు ఉంటారు. అది చాలా తప్పు. పండ్లు తింటే అసలు అనారోగ్యానికి గురి కారు. ఈ విషయాన్ని జనాల తేలికగా తీసుకుంటారు. అయితే పండ్లల్లో ద్రాక్షకు ఎంతో ప్రత్యేకత ఉంది. సాధారణంగా రెండు రకాల ద్రాక్షలు చూసి ఉంటారు. కానీ ద్రాక్షలో ఎన్నో రకాలు ఉన్నాయి. వాటి ధర పండ సీజన్‌లో అయితే రూ.వంద పైన సాధారణ రోజుల్లో 40-80 మధ్య ఉంటుంది. అయితే ఒక ద్రాక్ష పండు రకం ధర మాత్రం ఏకంగా రూ.లక్షల్లో ఉంటుంది. ఒక్క పండు ధరనే రూ.30 వేలు ఉంటుంది. ఆ పండు ఏ రకమో.. ఆ పండు ప్రత్యేకత ఏమిటో తెలుసుకోండి.
రూబీ రోమన్ ద్రాక్షగా పిలిచే ఈ పండ్లు అత్యధిక ధర కలిగి ఉంటుంది. ఈ పండ్లు జపాన్‌లో లభిస్తుంటాయి. ఈ పండ్లు ఎంతో ప్రత్యేకం కేవలం జపాన్‌లో మాత్రమే లభిస్తాయి. ఆ దేశంలోని ఇషికావా అనే ప్రాంతంలో మాత్రమే లభించే ఈ రూబీ రోమన్ పండ్లు మార్కెట్‌లో భారీ ఉంటుంది. ఒక బంచ్ (గుత్తి) ద్రాక్ష ధర రూ.లక్షల్లో ఉంటుంది.
ఈ పండు ప్రత్యేకతలు ఇవే..
- ఒకే రంగు, ఒకే సైజ్‌లో ఈ పండ్లు ఉంటాయి.
- ఎరుపులో ఉంటాయి.
- రుచి అద్భుతంగా ఉంటుంది. ఒక్కసారి తిన్నారంటే మరచిపోరు.
- సాధారణ ద్రాక్ష కంటే 18 శాతం అధికంగా తీపి కలిగి ఉంటుంది.
- ఈ పండ్ల విక్రయానికి అనేక నిబంధనలు ఉన్నాయి. ఇషికావా అధికారులు నిబంధనలకు అనుగుణంగా రూబీ రోమన్ ద్రాక్షపండ్లు విక్రయించాలి.
- ఈ పండ్ల నాణ్యత తనిఖీ చేసి ముద్ర వేసినవి మాత్రమే కొనుగోలు చేయాలి.
- ఏడాదిలో ఒకసారి మాత్రమే పండుతుంది.
ఈ పండ్లను 2020లో వేలం పాటి నిర్వహిస్తే ఏకంగా రూ.12 వేల డాలర్ల (దాదాపు రూ.8.86 లక్షలు)కు దక్కించుకున్నారు. అంటే ఒక్కో ద్రాక్ష పండు రూ.30 వేలకు పైగా ఉంటుంది.
These luxury Japanese grapes are over four times the size of standard grapes pic.twitter.com/sQ3kfa6TpW
— Business Insider (@BusinessInsider) September 20, 2021