పేగు క్యాన్సర్‌ చికిత్సలో అద్భుతం.. క్యాన్సర్‌ కణాలన్నీ మాయం

Rectal Cancer Patient Cured With Dostarlimab Drug Trial Here Full Details - Sakshi

న్యూయార్క్‌: పెద్దపేగు క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగులపై ప్రయోగించిన ఒక కొత్త ఔషధం అద్భుత ఫలితాలిచ్చింది. డోస్టార్లిమాబ్‌గా పిలిచే ఈ కొత్త మందును వారికి మూడు వారాలకోసారి చొప్పున ఆర్నెల్లు ఇవ్వడంతో క్యాన్సర్‌ కణతులు పూర్తిగా కనుమరుగయ్యాయని న్యూయార్క్‌ టైమ్స్‌ కథనం ప్రచురించింది. ఎండోస్కోపీ నుంచి ఎంఆర్‌ఐ  దాకా ఏ పరీక్షలోనూ క్యాన్సర్‌ కణాల జాడ కనిపించలేదు.

క్లినికల్‌ పరీక్షలో భాగమైన రోగులు తర్వాత కీమోథెరపీ, రేడియేషన్, చిన్నపాటి సర్జరీలకు వెళ్లాల్సి ఉంటుంది. కానీ ఈ రోగులకు ఆ అవసరం రాలేదని న్యూయార్క్‌ మెమోరియల్‌ స్లో ఆన్‌ కాటరింగ్‌ క్యాన్సర్‌ సెంటర్‌ డాక్టర్‌ లూయిస్‌ డియాజ్‌ అన్నారు. ‘‘ఇది 18 మంది రోగులపైనే జరిగిన ప్రయోగం. భారీ సంఖ్యలో ప్రయోగాలు జరిగాకే ఈ ఔషధంపై అవగాహనకు రావాలి’’ అని వైద్యరంగ నిపుణులు అభిప్రాయం వ్యక్తంచేశారు.
చదవండి👇
పబ్జీ ఆడొద్దన్నందుకు తల్లిని కాల్చి చంపిన కొడుకు
ఇవి మామూలు టొమాటోలు కావు.. బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top