China Worms Raining Video: చైనా ఆకాశం నుంచి పురుగుల వాన.. వీడియో వైరల్..!

Raining Worms In China Video Gone Viral In Social Media - Sakshi

బీజింగ్‌: చైనా రాజధాని బీజింగ్‌లో పురుగుల వాన కురిసిందని ఓ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఇందులో రోడ్డుపై ఎటుచూసినా పురుగులే దర్శనమిస్తున్నాయి. ఆకాశం నుంచి కుప్పలుకుప్పలుగా వచ్చి పడుతున్నాయి. కార్లు, ఇతర వాహనాలపై మొత్తం ఇవే నిండిపోయాయి. పురుగులు తమపై పడకుండా చాలా మంది గొడుగులతో కన్పించారు.

అమెరికాకు చెందిన న్యూయార్క్ పోస్టు ఇందుకు సంబంధించి వార్త ప్రచురించింది. వేలి పొడవు, బ్రౌన్ కలర్‌లో కన్పిస్తున్న ఈ పురుగులు విరక్తి కలిగించేలా ఉన్నాయి. అయితే పురుగుల వానకు కారణం ఏమై ఉంటుందనే విషయంపై మాత్రం స్పష్టత లేదు.

బలమైన ఈదురుగాలుల ధాటికి ఈ పురుగులన్నీ సుడిగాలిలో కొట్టుకుపోయి ఒక్కసారిగా ఆకాశం నుంచి వర్షం రూపంలో పడి ఉంటాయని సైంటిఫిక్ జర్నల్ మదర్ నేచర్ నెట్‌వర్క్ తెలిపినట్లు న్యూయార్క్ పోస్టు పేర్కొంది. అయితే ఈ వీడియో ఫేక్ అని చైనా జర్నలిస్టు కొట్టిపారేశాడు. తాను చాలా రోజులుగా బీజింగ్‌లోనే ఉంటున్నానని, అసలు ఇక్కడ వర్షమే కురవలేదని చెప్పాడు.
చదవండి: ఇంత బరువున్నావ్.. ఎక్కువ రోజులు బతకవ్.. దెబ్బకు 165 కిలోలు తగ్గాడు..

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top