ఇంత బరువున్నావ్.. ఎక్కువ రోజులు బతకవ్.. దెబ్బకు 165 కిలోలు తగ్గాడు..

US Mississippi Man loses 165 Kgs - Sakshi

వాషింగ్టన్‌: బరువు విపరీతంగా పెరిగిపోయి సరిగ్గా నడవలేని స్థితికి చేరుకున్న ఓ వ్యక్తికి డాక్టర్లు చెప్పిన విషయం దిమ్మతిరిగేలా చేసింది. ఇలాగే ఉంటే 3-5 ఏళ్లకు మించి బతకవు, నీ టైం బాంబ్ కౌంట్ డైన్ స్టార్ట్ అయింది.. అనే మాట అతడి జీవితాన్ని మార్చేసింది.

అమెరికా మిసిసిప్పికి చెందిన 42 ఏళ్ల ఈ వ్యక్తి పేరు నికోలస్ క్రాఫ్ట్.  2019లో ఇతని బరువు 294 కిలోలు. వైద్యులు షాకింగ్ విషయం చెప్పిన తర్వాత ఎలాగైనా బరువు తగ్గాలని నిశ్చయించుకున్నాడు. వెంటనే డైట్ మొదలుపెట్టాడు. నెల రోజుల్లోనే 40 కిలోలు తగ్గాడు. దీంతో అతడి ఆత్మవిశ్వాసం రెట్టింపు అయ్యింది.

‍అప్పటి నుంచి డైట్‌తో పాటు వ్యాయామం చేస్తూ 165 కిలోల బరువు తగ్గాడు క్రాఫ్ట్. ప్రస్తుతం ఇతని బరువు 129 కేజీలు. దీంతో ప్రాణాపాయం నుంచి బయటపడటమే గాక ఆరోగ్యంగా తయారయ్యాడు.

అయితే తాను డిప్రెషన్‌లోకి వెళ్లి అధికంగా తినడం వల్లే బరువు పెరిగినట్లు క్రాఫ్ట్ చెప్పుకొచ్చాడు. తనకు ఆత్మహత్య ఆలోచనలు వచ్చేవని పేర్కొన్నాడు. తన కుటుంబసభ్యులు, స్నేహితుల సహకారంతోనే ఒత్తిడి నుంచి బయటపడి బరువు తగ్గినట్లు చెప్పకొచ్చాడు.

165 కిలోల బరువు తగ్గడంతో క్రాఫ్ చర్మమంతా వదులైంది. దీంతో నొప్పి వచ్చి అతను ఇబ్బందిపడుతున్నాడు. శస్త్రచికిత్స చేసుకునేందుకు సిద్ధమవుతున్నాడు. అయితే దీనికి ఇన్సూరెన్స్ వర్తించదని, ఏదైనా అద్భుతం జరుగుతుందేమోనని ఎదురు చూస్తున్నాడు.
చదవండి: ఆమె పోరాడింది.. టాప్‌లెస్‌ సమానత్వం సాధించింది

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top