శాంతి, సుస్థిరతకు చర్చలే మార్గం | PM Narendra Modi Historic Ukraine Visit, A Hug And Handshake With Zelensky | Sakshi
Sakshi News home page

శాంతి, సుస్థిరతకు చర్చలే మార్గం

Aug 24 2024 4:15 AM | Updated on Aug 24 2024 9:09 AM

PM Narendra Modi Historic Ukraine Visit, A Hug And Handshake With Zelensky

ఉక్రెయిన్‌–రష్యా కలిసి కూర్చొని మాట్లాడుకోవాలి  

సంఘర్షణకు సాధ్యమైనంత త్వరగా తెరదించాలి  

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విజ్ఞప్తి  

ఉక్రెయిన్‌లో మోదీ పర్యటన... అధ్యక్షుడు జెలెన్‌స్కీతో భేటీ

కీవ్‌/న్యూఢిల్లీ: ఉక్రెయిన్‌–రష్యా మధ్య సంఘర్షణకు సాధ్యమైనంత త్వరగా తెరదించాలని, ఇందుకోసం రెండు దేశాలు చర్చించుకోవాలని భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విజ్ఞప్తి చేశారు. ఆయన పోలండ్‌ నుంచి ట్రైన్‌ ఫోర్స్‌ వన్‌ రైలులో బయలుదేరి, 10 గంటలపాటు సుదీర్ఘ ప్రయాణం సాగించి, శుక్రవారం ఉక్రెయిన్‌ రాజధాని కీవ్‌కు చేరుకున్నారు. మోదీకి ఉక్రెయిన్‌ ప్రభుత్వ అధికారులు, భారతీయులు ఘన స్వాగతం పలికారు. 

కీవ్‌లో ఆయన బస చేసిన హయత్‌ హోటల్‌ వద్దకు పెద్ద సంఖ్యలో భారతీయులు తరలివచ్చారు. వారికి మోదీ అభివాదం చేశారు. 1991 తర్వాత ఉక్రెయిన్‌లో భారత ప్రధాని పర్యటించడం ఇదే మొదటిసారి. ఉక్రెయిన్‌పై రష్యా దండయాత్ర.. రష్యాపై ఉక్రెయిన్‌ ఎదురుదాడి ఉధృతమవుతున్న నేపథ్యంలో భారత ప్రధానమంత్రి పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. 

కీవ్‌లో అడుగుపెట్టిన తర్వాత మోదీ నేషనల్‌ మ్యూజియం ఆఫ్‌ హిస్టరీ వద్దనున్న ‘మల్టీమీడియా మారీ్టరాలజిస్టు ఎక్స్‌పోజిషన్‌’ను సందర్శించారు. యుద్ధంలో మరణించిన ఉక్రెయిన్‌ చిన్నారుల స్మారకార్థం ఈ కట్టడాన్ని నిర్మించారు. ఇక్కడ ప్రధాని మోదీ ఓ బొమ్మను ఉంచి, అమరులైన బాలలకు నివాళులరి్పంచారు. చేతులు జోడించి నమస్కరించారు. వారిని తలచుకొని చలించిపోయారు. 

ఈ సందర్భంగా ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీని మోదీ ఆలింగనం చేసుకున్నారు. కరచాలనం చేశారు. యుద్ధంలో దెబ్బతిన్న ఉక్రెయిన్‌కు మద్దతు ప్రకటిస్తూ జెలెన్‌స్కీ భుజంపై మోదీ ఆతీ్మయంగా చెయ్యి వేశారు. అనంతరం కీవ్‌ సిటీలోని ఒయాసిస్‌ ఆఫ్‌ పీస్‌ పార్కులో మహాత్మా గాంధీ విగ్రహం వద్ద మోదీ ఘనంగా నివాళులరి్పంచారు. 

శాంతి, సామరస్యంతో వర్ధిల్లే సమాజ నిర్మాణానికి మహాత్ముడు బోధించిన శాంతి సందేశం ఎల్లవేళలా అనుసరణీయమని ప్రధానమంత్రి ఈ సందర్భంగా పేర్కొన్నారు. గాం«దీజీ చూపిన ఆదర్శ మార్గం ప్రస్తుతం ప్రపంచం ఎదుర్కొంటున్న సంక్షోభాలకు చక్కటి పరిష్కార మార్గం అవుతుందన్నారు. కీవ్‌లో స్కూల్‌ ఆఫ్‌ ఓరియంటల్‌ స్టడీస్‌లో హిందీ భాష నేర్చుకుంటున్న ఉక్రెయిన్‌ విద్యార్థులతో మోదీ ముచ్చటించారు.  

ఆచరణాత్మక సంప్రదింపులు జరగాలి 
ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీతో మోదీ సమావేశమయ్యారు. భారత్‌–ఉక్రెయిన్‌ మధ్య సంబంధాలు, ద్వైపాక్షిక అంశాలపై చర్చించారు. వాణిజ్యం, ఆర్థికం, రక్షణ, ఫార్మాస్యూటికల్స్, వ్యవసాయం, విద్య తదితర రంగాల్లో కలిసి పని చేయాలని నిర్ణయించుకున్నారు. భారత్‌–ఉక్రెయిన్‌ మధ్య ప్రతినిధుల స్థాయి చర్చలు కూడా జరిగాయి. ఉక్రెయిన్‌–రష్యా మధ్య సంఘర్షణ అంతం కావాలని, ఈ ప్రాంతంలో శాంతి, సుస్థిరత నెలకొనాలని ప్రధానమంత్రి మోదీ ఆకాంక్షించారు.

 సంఘర్షణకు సాధ్యమైనంత త్వరగా ముగింపు పలికేలా ఒక పరిష్కార మార్గాన్ని కనుక్కోవడానికి ఉక్రెయిన్, రష్యా పరస్పరం చర్చించుకోవాలని కోరారు. శాంతి, సుస్థిరత కోసం రెండు దేశాల మధ్య ఆచరణాత్మక సంప్రదింపులు జరగాల్సిన అవసరం ఉందని చెప్పారు. జెలెన్‌స్కీతో జరిగిన చర్చలో మోదీ ఈ అంశాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించినట్లు భారత విదేశాంగ మంత్రి ఎస్‌.జైశంకర్‌ వెల్లడించారు. 

ఉక్రెయిన్‌లో శాంతియుత పరిస్థితుల పునరుద్ధరణకు అన్ని రకాలుగా సాయం అందిస్తామని మోదీ హామీ ఇచి్చనట్లు తెలిపారు. మోదీ–జెలెన్‌స్కీ మధ్య నిర్మాణాత్మక, సమగ్ర చర్చ జరిగిందన్నారు. ఉక్రెయిన్‌లో ప్రస్తుత పరిస్థితులు, ఆహార, ఇంధన భద్రత కొరవడడంపై మోదీ ఆందోళన వ్యక్తం చేశారని పేర్కొన్నారు. 
 


ఉక్రెయిన్‌–రష్యా మధ్య చర్చలు ప్రారంభించి, ముందుకు తీసుకెళ్లడానికి అందుబాటులో ఉన్న ప్రభావవంతమైన మార్గాలపై మోదీ, జెలెన్‌స్కీ చర్చించుకున్నారని 
వివరించారు. ఆ రెండు దేశాలు కలిసి కూర్చొని చర్చించుకొని, సంఘర్షణకు పరిష్కారం కనిపెట్టాలన్నదే భారతదేశ అభిమతమని జైశంకర్‌ స్పష్టంచేశారు. మోదీ చేపట్టిన ఉక్రెయిన్‌ పర్యటనను ఒక ల్యాండ్‌మార్క్‌గా ఆయన అభివర్ణించారు.  

నాలుగు భీష్మ్‌ క్యూబ్స్‌ బహూకరణ  
ప్రధాని మోదీ ఉక్రెయిన్‌ ప్రభుత్వానికి నాలుగు భీష్మ్‌ (భారత్‌ హెల్త్‌ ఇనీíÙయేటివ్‌ ఫర్‌ సహయోగ్‌ హిత, మైత్రి) క్యూబ్స్‌ను బహూకరించారు. అన్ని ర కాల గాయాలకు చికిత్స అందించేందుకు అవసర మైన ఔషధాలు, పరికరాలు, వస్తువులు ఈ క్యూబ్స్‌ లో ఉన్నాయి. అంతేకాదు పరిమితంగా విద్యుత్, ఆ క్సిజన్‌ను ఉత్పత్తిచేసే పరికరాలు సైతం ఉన్నాయి.  

భారత్‌ మద్దతు మాకు కీలకం: జెలెన్‌స్కీ  
తమ దేశ జాతీయ సార్వభౌమత్వం, ప్రాదేశిక సమగ్రతకు భారత్‌ మద్దతు ఇస్తోందని ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ పేర్కొన్నారు. భారత్‌ మద్దతును తాము అత్యంత కీలకమైనదిగా భావిస్తున్నామని చెప్పారు. భారత ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అనంతరం జెలెన్‌స్కీ ‘ఎక్స్‌’లో పోస్టు చేశారు. ఈ రోజు ఒక కొత్త చరిత్ర నమోదైందని పేర్కొన్నారు. భారత్‌లో పర్యటించాలని జెలెన్‌స్కీని మోదీ ఆహ్వానించారు.

జెలెన్‌స్కీ అప్పుడేమన్నారంటే... 
ఉక్రెయిన్‌ పర్యటనలో అధ్యక్షుడు జెలెన్‌స్కీని ప్రధాని మోదీ ఆతీ్మయంగా ఆలింగనం చేసుకోవడం, భుజంపై చెయ్యి వేయడం ప్రపంచవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్శించింది. దీనిపై పలు వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి. నరేంద్ర మోదీ ఈ ఏడాది జూలై 9వ తేదీన రష్యాలో పర్యటించారు. రష్యా అధినేత పుతిన్‌తో సమావేశమై, చర్చలు జరిపారు. ఈ సందర్భంగా ఇరువురు నేతలు ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్నారు. ఫొటోలకు ఫోజులిచ్చారు. 

ఈ ఆత్మీయ కలయికపై అప్పట్లో జెలెన్‌స్కీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. శాంతి ప్రయత్నాలకు ఇదొక ఎదురుదెబ్బ అని ఆక్షేపించారు. ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశానికి ప్రధానమంత్రి అయిన నరేంద్ర మోదీ ప్రపంచంలో అత్యంత క్రూరమైన రక్తపిపాసి, నేరగాడు అయిన పుతిన్‌ను ఆలింగనం చేసుకున్నారని మండిపడ్డారు. ఈ మేరకు ‘ఎక్స్‌’లో పోస్టుచేశారు. జెలెన్‌స్కీ అప్పట్లో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు మరోసారి తెరపైకి వచ్చాయి.  

నాలుగు ఒప్పందాలపై భారత్, ఉక్రెయిన్‌ సంతకాలు  
మోదీ–జెలెన్‌స్కీ చర్చల తర్వాత నాలుగు కీలక ఒప్పందాలపై భారత్, ఉక్రెయిన్‌ శుక్రవారం సంతకాలు చేశాయి. వ్యవసాయం, ఆహార పరిశ్రమ, ఔషధాలు, సాంస్కృతికం–మానవతా సాయం విషయంలో రెండు దేశాలు పరస్పరం సహకరించుకోనున్నాయి.  

సోషల్‌ మీడియాలో విశేష స్పందన  
మోదీ, జెలెన్‌స్కీ భేటీకి సోషల్‌ మీడియాలో విశేష స్పందన లభించింది. ఈ సమావేశం గురించి నెటిజన్లు విస్తృతంగా చర్చించుకున్నారు. తమ అభిప్రాయాలు పంచుకున్నారు. మోదీతో కలిసి ఉన్న ఫొటోలను జెలెన్‌స్కీ తన ఇన్‌స్టా్రగామ్‌ ఖాతాలో పోస్టు చేశారు. ఈ పోస్టుకు గంటల వ్యవధిలోనే 10 లక్షలకుపైగా లైక్‌లు వచ్చాయి. భారత్‌–ఉక్రెయిన్‌ అనుబంధాన్ని బలోపేతం చేసుకోవడానికి ఈ సమావేశం చాలా కీలకమని జెలెన్‌స్కీ ఉద్ఘాటించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement