ఇస్లామాబాద్: పాకిస్థాన్‌లో పెను ప్రమాదం చోటు చేసుకుంది. బలూచిస్థాన్ ప్రావిన్స్‌లో ఈ రోజు (సోమవారం) సైనిక శిక్షణ కుప్పకూలింది. ఈ ప్రమాదంలో విమానంలో ఉన్న ఇద్దరు పైలట్లు ప్రాణాలు కోల్పోయారు. ఈ వివరాల్ని పాకిస్థాన్ ఆర్మీ ప్రకటించింది.
బలూచిస్థాన్ ప్రావిన్స్‌లోని నవాన్ కిల్లీ పట్టణం సమీపంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. పీఏసీ ఎంఎఫ్‌ఐ-17 ముష్షాక్ (PAC MFI-17 Mushshak) రకానికి చెందిన శిక్షణ విమానం ప్రమాదానికి గురైనట్లు సైన్యం తెలిపింది. విమానంలో తలెత్తిన సాంకేతిక లోపమే ప్రమాదానికి కారణమని ప్రాథమికంగా భావిస్తున్నారు. అయితే సాంకేతిక సమస్యకు సంబంధించిన పూర్తి వివరాలను వెల్లడించలేదు.
అయితే ఈ ప్రమాదంపై పాకిస్థాన్ అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీ, ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. మృతిచెందిన పైలట్ల కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
అయితే బలూచిస్థాన్ ప్రావిన్స్‌లో ప్రస్తుతం తీవ్ర నిరసనలు చోటు చేసుకుంటున్నాయి. పాకిస్థాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలు పెద్దఎత్తున నిరసనలు చేపడుతున్నారు. ఈ నేపథ్యంలో సైనిక విమానం క్రాష్ అవ్వడం పలు అనుమానాలకు తావిస్తోంది. అయితే సాంకేతిక లోపమే కారణమని సైన్యం చెబుతోంది.
ఇదీ చదవండి: బంగారు గనిపై దాడి
#BREAKING: A Pakistan Army Aviation Mushshak training aircraft crashed near Nawan Killi, Quetta, on 12 October 2026, reportedly due to a technical fault after takeoff from Quetta Cantonment Air Base. Both pilots, Major Husnain Shehzad Humayun and Captain Abdul Samad killed. https://t.co/9MltamLVL6
— Aditya Raj Kaul (@AdityaRajKaul) October 12, 2026


